Vijay Antony Bhadrakaali: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పవర్‌ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్‌.. ఎక్కడ చుడొచ్చంటే..?

విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' అక్టోబర్ 24న Jio Hotstarలో విడుదల కానుంది. ఇది పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది, విజయ్ ఆంటోనీ రాజకీయ స్కామ్‌ చుట్టూ తిరిగే కథతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంటుంది.

New Update
Vijay Antony Bhadrakaali

Vijay Antony Bhadrakaali

Vijay Antony Bhadrakaali: విజయ్ ఆంటోనీ నటించిన తాజా పొలిటికల్ థ్రిల్లర్ ‘భద్రకాళి’ (తమిళంలో శక్తి తిరుమగన్) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. థియేటర్లలో సెప్టెంబర్ 19, 2025న విడుదలైన ఈ సినిమా తాజాగా  థియేట్రికల్ రన్‌ను పూర్తిచేసుకొని, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.

ఈ చిత్రాన్ని అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా స్వయంగా ఈ సినిమాకు సంగీతం అందించారు. అలాగే, తన సొంత బ్యానర్ విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ పై ఈ సినిమాను నిర్మించారు.

ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ (Vijay Antony Bhadrakaali OTT)

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, JioCinema - Hotstar ఈ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందింది. ఈ నెల అక్టోబర్ 24 నుండి ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానుంది. థియేటర్లలో విడుదలైన తర్వాత 5 వారాల వ్యవధిలోనే ఓటీటీలో రిలీజ్ అవుతోంది.

కథ.. 

ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ ఒక రాజకీయ మీడియేటర్ పాత్రలో కనిపించనున్నాడు. అతను ఓ స్కామ్‌లో చిక్కుకోవడం, దాని వెనకున్న కుట్రలు, రాజకీయ నాయకుల స్వార్థాలు వంటి అంశాలను ఈ సినిమా మాట్లాడుతోంది. మొదటి భాగంలో కథ వేగంగా, ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా, రెండవ భాగం కొంచెం నెమ్మదిగా సాగిందని కొన్ని రివ్యూలు చెబుతున్నాయి. అయితే మొత్తంగా సినిమా నేరేషన్ ఆకట్టుకునేలా ఉండటంతో, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో విజయ్ ఆంటోనీతో పాటు వాగై చంద్రశేఖర్, సునీల్ క్రిపలాని, సెల్ మురుగన్, త్రుప్తి రవీంద్ర, రిని, రియా ఋతు, మాస్టర్ కేశవ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. కథలో రాజకీయ మలుపులు, సామాజిక అంశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.

రియలిస్టిక్ పొలిటికల్ థ్రిల్లర్స్‌కి ఆసక్తి ఉన్నవారికి ‘భద్రకాళి’ తప్పకుండా చూడదగ్గ సినిమా. అసలు రాజకీయాల వెనుక జరుగుతున్న నిజాలు, ప్రజలతో ఆడే ఆటలు ఎలా ఉంటాయన్నది ఈ సినిమా చూపిస్తుంది. అక్టోబర్ 24న మీస్మార్ట్‌ఫోన్‌లో లేదా టీవీలో Jio Hotstar ద్వారా ఈ సినిమాను చూసేయండి.

Advertisment
తాజా కథనాలు