RAZAKAR: భారతదేశంలో హైదరాబాద్ సంస్థాన విలీనానికి ముందు రజాకార్లు చేసిన ఆకృత్యాలు, చరిత్రలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం 'రజాకార్'. ఈ చిత్రాన్ని యాటా సత్యనారాయణ తెరకెక్కించారు. ఇందులో బాబీ సింహా, అనసూయ, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది మార్చి 15న పలు వివాదాల నడుమ విడుదలైన మూవీపై అనేక విమర్శలు వచ్చాయి. ఒక వర్గం వారిని కించపరిచేలా ఉందంటూ ప్రతికూల అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.
Also Read: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా
ఓటీటీలో రజాకార్
పలు వివాదాలతో చుట్టుముట్టిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలో వేదిక పై స్ట్రీమింగ్ కి వస్తోంది. త్వరలో రజాకార్ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 20 లేదా 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
సమరవీర్ క్రియేషన్స్ LLP బ్యానర్ పై గూడూరు నారాయణ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. తెలంగాణ పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేసినట్లు నిర్మాత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.