Mass Jathara Review: ‘మాస్‌ జాతర’ హిట్టు బొమ్మ.. సెన్సార్ టాక్ ఇదే..!

రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న “మాస్ జాతర” అక్టోబర్ 31న విడుదల కానుంది. సెన్సార్ నుండి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా మీద హైప్ పెరిగింది. ప్రేక్షకులు ‘వింటేజ్ రవితేజ’ను చూడబోతున్నామని ఫ్యాన్స్ అంటున్నారు.

New Update
Mass Jathara

Mass Jathara Review

Mass Jathara Review:మాస్ మహారాజా రవితేజ(Raviteja) నటిస్తున్న తాజా చిత్రం “మాస్ జాతర” ఈ నెల అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహించగా, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో “ధమాఖా” విజయానంతరం మళ్లీ కలిసి రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించగా, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. రవితేజ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్, భీమ్స్ మాస్ బీట్‌లతో ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం నెలకొంది.

ఇటీవల సినిమా సెన్సార్‌ పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ సభ్యులు సినిమా చాలా ఎంజాయ్ చేశారని, పాజిటివ్ టాక్ ఇచ్చారని సమాచారం. సినిమా నిడివి 2 గంటల 23 నిమిషాలు, అంటే సరైన కమర్షియల్ రన్ టైమ్ అని చెప్పొచ్చు.. 

ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో స్టార్ హీరో సూర్య ప్రత్యేక అతిథిగా హాజరై, “ఈ సినిమా రవితేజకు సాలిడ్ కమ్‌బ్యాక్ అవుతుంది. అక్టోబర్ 31 నుంచి మాస్ జాతర మొదలవుతుంది!” అని అనడంతో అభిమానులు ఫుల్ ఖుషి అయిపోయారు.

దర్శకుడు భాను మాట్లాడుతూ  “ప్రొడ్యూసర్ నాగవంశీ సినిమాపై చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఆయన లాంటి క్రిటిక్ పాజిటివ్ టాక్ ఇవ్వడం అంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నా” అని చెప్పాడు.

ఇప్పటికే ఇండస్ట్రీలోనూ, ఫ్యాన్స్ సర్కిల్స్‌లోనూ ‘మాస్ జాతర’కు సూపర్ హిట్ టాక్ వస్తోంది. సినిమాను చూసిన వారు “ఇందులో మనం మళ్లీ వింటేజ్ రవితేజని చూస్తాం. మొదటి నుంచి చివరి వరకు ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిపోయింది” అంటున్నారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్ అన్నీ సరైన మోతాదులో ఉండటంతో ఇది రవితేజ కెరీర్‌లో మరో మాస్ బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది.

మొత్తం మీద, “మాస్ జాతర” ఒక ఫుల్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. రవితేజ స్టైల్ డైలాగ్స్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, భీమ్స్ బీట్స్, శ్రీలీల గ్లామర్ ఇవన్నీ కలిపి థియేటర్స్‌లో పండగ వాతావరణం సృష్టించనున్నాయి. అక్టోబర్ 31 నుంచి నిజంగానే “మాస్ జాతర” మొదలుకానుంది! 

రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న “మాస్ జాతర” అక్టోబర్ 31న విడుదల కానుంది. సెన్సార్ నుండి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా మీద హైప్ పెరిగింది.  ప్రేక్షకులు ‘వింటేజ్ రవితేజ’ను చూడబోతున్నామని ఫ్యాన్స్ అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు