Ratan Tata : రతన్ టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండదు. టీ నుంచి ట్రాక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినబడుతోంది. సుమారు 6 లక్షల కోట్ల విలువతో దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులతో దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీని స్థాపించారు. అనేక స్వచ్ఛంద సంస్థలకు, జంతు సంరక్షణ కేంద్రాలకు కూడా విరాళాలు అందించారు. ఆయన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది విద్యార్థుల చదువులకు సహాయపడి.. భవిష్యత్తు తారలను ముందుకు తీసుకెళ్లిన రతన్ టాటా నిన్న ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
రతన్ టాటా నిర్మించిన ఏకైక చిత్రం
పారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేసిన రతన్ టాటా.. సినీ రంగాన్ని కూడా పలకరించారు. రతన్ టాటా 2004 లో 'ఏత్‌బార్' చిత్రాన్ని నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రలో నటించారు. 1996 అమెరికన్ ఫిల్మ్ ఫియర్ ఆధారంగా 'ఏత్‌బార్' రూపొందింది. విక్రమ్ భట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రతన్ నిర్మించిన ఏకైక చిత్రం ఇది.
Also Read: కుక్క కోసం.. బ్రిటన్ రాజునే లెక్కచేయని టాటా! రూ.165 కోట్లతో డాగ్ హాస్పిటల్