World of Thama: బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడక్ ఫిల్మ్స్ హారర్-కామెడీ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'థామ'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'వరల్డ్ ఆఫ్ థామ' అనే పేరుతో మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా(Rashmika Mandanna), అయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Na darr kabhi itna shaktishaali tha, aur na pyaar kabhi itna BLOODY!🦇
— Maddockfilms (@MaddockFilms) August 19, 2025
Brace yourself this Diwali to witness the first love story in the Maddock Horror-Comedy Universe. Step into the World of Thama, a cinematic experience unlike anything you’ve seen before, storming into cinemas… pic.twitter.com/xw1OeTZn9P
World of Thama
టీజర్ చూస్తుంటే.. ఇదొక డబుల్ టైం లైన్లో జరిగే కథగా సాగనున్నట్లు తెలుస్తోంది. ఒకటి ఆధునిక ఢిల్లీ, మరొకటి పురాతన విజయనగరం. ఈ రెండు కాలాల మధ్య జరిగే సంఘటనల ఆధారంగా కథ ఉంటుంది. ఇందులో రష్మిక 'తడక' అనే అతీత శక్తి గల పాత్రలో చాలా భయంకరంగా కనిపించింది. మునుపెన్నడూ ఆమె చేయని విధంగా ఈ రోల్ ఉండబోతుందని అర్థమవుతోంది. టీజర్ లో రష్మిక విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇక హీరో ఆయుష్మాన్ ఖురానా 'అలోక్ ' అనే చరిత్ర పరిశోధకుడిగా కనిపించబోతున్నాడు. అతడు పాతకాలం నాటి రక్త పిశాచాల గురించి పరిశోధన చేస్తుంటాడు. ఈ క్రమంలో అతీత శక్తులు గల రష్మిక- ఆయుష్మాన్ మధ్య ప్రేమ కథ ఎలా మొదలైంది? రశ్మికకు ఉన్న అతీత శక్తులేంటి? ఆమె కూడా ఒక రక్తపిశాచా? అనే అంశాలతో టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. మొత్తానికి టీజర్ ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటోంది.
టీజర్ లో రష్మిక- ఆయుష్మాన్ పాత్రలతో పాటు సినిమాలోని ఇతర పాత్రలను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ 'యక్షసాన్' అనే పురాతన కాలం నాటి క్రూరమైన విలన్ పాత్రలో కనిపించారు. ఇక మలైకా అరోరా ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇందులో పరేష్ రావల్, ఫైసల్ మాలిక్ తదితరులు కూడా కీలక పత్రాలు పోషించారు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే మ్యాడక్ ఫిల్మ్స్ హారర్-కామెడీ యూనివర్స్‌లో భాగంగా విడుదలైన 'స్త్రీ', 'భేడియా', 'ముంజ్య' చిత్రాలు సూపర్ హిట్ విజయాన్ని సాధించాయి. దీంతో 'థామ' పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే పుష్ప సినిమతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న రష్మిక ఫుల్ బిజీ అయిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ వివిధ భాషల్లో సినిమాలు అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడుకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి.
Also Read: Janhvi Kapoor Photos: అబ్బా ! లెహంగాలో 'పరమ్ సుందరి' ఫోటోషూట్ అదిరింది.. కుర్రకారు ఫిదా!