Rashmika Mandanna: అది చేయాలని ఉంది.. రష్మిక కామెంట్స్ వైరల్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కొరియన్ డ్రామాలపై  తనకున్న ఇష్టాన్ని గతంలో చాలా సందర్భాల్లో చెప్పింది. అయితే తాజాగా  'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రష్మిక మరోసారి కొరియన్ డ్రామాలపై తన ఇష్టాన్ని చాటుకుంది.

New Update
rashmika

rashmika

Rashmika Mandanna:  నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కొరియన్ డ్రామాలపై  తనకున్న ఇష్టాన్ని గతంలో చాలా సందర్భాల్లో చెప్పింది. అయితే తాజాగా  'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రష్మిక మరోసారి కొరియన్ డ్రామాలపై తన ఇష్టాన్ని చాటుకుంది. కొరియన్ డ్రామాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చింది. ఎప్పటికైనా ఒక కొరియన్ డ్రామా చేయాలని అనుకుంటున్నాను. అది చాలా సరదాగా ఉంటుంది. అయితే నాకు ఎలాంటి పాత్ర ఇస్తారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆ పాత్ర, ప్రాజెక్ట్  సరైనదిగా  అనిపిస్తేనే చేస్తానని తెలిపింది. 

బ్యాక్ టూ బ్యాక్ 

 రష్మిక మందన్న వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉంది. ఇటీవలే 'ది గర్ల్ ఫ్రెండ్'  సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.  నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మరియు మలయాళంతో సహా అనేక భాషల్లో విడుదలైంది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ వినిపించినప్పటికీ.. రెండవ రోజు ఊపందుకుంది. పాజిటివ్  మౌత్ టాక్ ద్వారా రెండో రోజు సినిమా వసూళ్లు గమనీయంగా పెరిగాయి.  ఈనెల 7న విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లో అన్ని భాషల్లో కలిపి రూ. 6 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Also Read: Raja Saab Songs: సాంగ్ రూమర్స్ పై స్పందించిన 'రాజాసాబ్' టీమ్.. ఫస్ట్ సింగిల్ ఆన్ ది వే!!

Advertisment
తాజా కథనాలు