రాశీఖన్నా కు బ్రేకప్.. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన హీరోయిన్?

రాశీ ఖన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ గురించి గుర్తు చేసుకుంది. వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌. గతంలో నాకో లవ్‌ స్టోరీ ఉండేది. కొన్ని కారణాల వల్ల బ్రేకప్‌ అయ్యింది. ఆ సమయంలో ఎంతో బాధపడ్డా. మానసికంగా కుంగుబాటుకు గురయ్యానని చెప్పింది.

sdx
New Update

టాలీవుడ్ లో చాలా తక్కువ టైం లోనే అగ్ర హీరోయిన్ స్థాయికి ఎదిగింది రాశీ ఖాన్నా. 'ఊహలు గుస గుస లాడే' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్, గోపీచంద్, రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ తో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

ఆ తర్వాత కొన్నాళ్ళకు తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ప్రెజెంట్ హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా రాశీ ఖన్నా ‘ది సబర్మతీ రిపోర్ట్' అనే సినిమాలో నటించింది. గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రాంత్ మస్సే లీడ్ రోల్ ప్లే చేశాడు. 

Also Read :  డాక్టర్ తో డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్

ఎంతో బాధపడ్డా..

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ ఖన్నా.. తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇందులో భాగంగానే తన బ్రేకప్ గురించి గుర్తు చేసుకుంది." వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌. గతంలో నాకో లవ్‌ స్టోరీ ఉండేది. కొన్ని కారణాల వల్ల బ్రేకప్‌ అయ్యింది. ఆ సమయంలో ఎంతో బాధపడ్డా. మానసికంగా కుంగుబాటుకు గురయ్యా. 

ఆ తర్వాత నన్ను నేను మార్చుకున్నా. స్ట్రాంగ్‌గా నిలబడ్డా. కెరీర్‌పై దృష్టి పెట్టా. ఇండస్ట్రీలో కంటే బయటే నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులే నాకు అన్ని విధాలుగా సపోర్ట్‌ చేస్తుంటారు. వారే నా బలం.." అంటూ చెప్పుకొచ్చింది. దీంతో రాశీ ఖన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : రీమేక్ వద్దని చెప్తే వినలేదు.. వాటి మీదైనా దృష్టి పెట్టుంటే హిట్ అయ్యేదేమో

#raashi-khanna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe