Harsha Sai : హర్షసాయి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

యూట్యూబర్ హర్షసాయి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, రేప్‌ చేసి వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని బాధిత నటి ఇచ్చిన ఫిర్యాదు అతనిపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. ఈరోజు అతడిని అరెస్ట్ చేయన్నున్నట్లు తెలుస్తోంది.

New Update

Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి చిక్కుల్లో పడ్డాడు. అతనిపై రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, రేప్‌ చేసి వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేశాడని.. పెద్దమొత్తంలో డబ్బు తీసుకున్నాడని హర్షసాయిపై బాధిత నటి ఫిర్యాదు చేసింది. బాధిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్షసాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. నేరం రుజువైతే హర్షసాయికి కనీసం పదేళ్ల జైలు పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హర్షసాయి తండ్రి రాధాకృష్ణ కూడా తనను వేధించాడని పోలీసులకు నటి ఫిర్యాదు చేసింది. కాగా హర్షసాయితో పాటు అతని తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అత్యాచార కేసుపై స్పందించిన హర్ష సాయి

తనపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో అత్యాచార కేసు నమోదు కావడంపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'డబ్బుల కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. నా అడ్వొకేట్ అన్ని వివరాలు వివరిస్తారు. నేనేంటో నా ఫాలోవర్స్కు తెలుసు' అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. అటు హర్షసాయి కోసం HYD పోలీసులు గాలిస్తున్నారు.

Also Read :  15 లక్షల రేషన్ కార్డులు రద్దు?

Advertisment
Advertisment
తాజా కథనాలు