ఆ శృంగార తార మీద ఒట్టు.. నీ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకుంటా : RGV

రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో ఆయన ఓ డైరెక్టర్ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకుంటా అని, అందుకు ఓ శృంగార తార మీద ఒట్టు కూడా వేశారు. ఇంతకీ RGV.. ఏ డైరెక్టర్ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకుంటానని అన్నాడు? అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

RGV
New Update

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆ పోస్ట్ లో ఆయన ఓ డైరెక్టర్ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకుంటా అని అనడం గమనార్హం. ఇంతకీ RGV.. ఏ డైరెక్టర్ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకుంటానని అన్నాడు? పూర్తి వివరాల్లోకి వెళ్తే..

'అర్జున్ రెడ్డి' మూవీతో సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా.. గత ఏడాది 'యానిమల్' మూవీతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నాడు. రణ్‍వీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం రూ.900కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. తాజాగా ఐఫా అవార్డ్స్ లో ఈ సినిమా సత్తా చాటింది. 

2024 ఐఫా వేడుకల్లో యానిమల్ మూవీ బెస్ట్ ఫిలిం, బెస్ట్ నెగిటివ్ రోల్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ డిజైన్.. ఇన్ని విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ సందర్బంగా యానిమల్ సినిమాకు సందీప్ వంగా బెస్ట్ ఎడిటింగ్ అవార్డును అందుకున్నాడు. 

ఆయన సినిమాలు చూసే నేర్చుకున్నా..

ఈ క్రమంలో స్టేజి మీద మాట్లాడుతూ."ఈ అవార్డు ఇచ్చినందుకు ఐఫాకు ధన్యవాదాలు. ఈ ఎడిటింగ్ విభాగంలో నేను అవార్డు వస్తుందని అసలు ఊహించలేదు. డైరెక్టర్, నిర్మాత, రైటర్ ఇవన్నీ కాకుండా ఎడిటింగ్ లో వచ్చినందుకు సంతోషంగా ఉంది. చాలా రేర్ అవార్డు ఇది. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలి. రామ్‍గోపాల్ వర్మ సినిమాలు చూసి నేను ఎడిటింగ్ నేర్చుకున్నా. 

ఆయన చిత్రాల్లో తాను పని చేయకపోయినా చాలా నేర్చుకున్నాను. థ్యాంక్య్ ఆర్జీవీ సర్" అని అన్నాడు. దీంతో ఆర్జీవీ అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ.. "సర్ సందీప్ రెడ్డి వంగా నేను ఇప్పుడు మీ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను.  అమెరికన్ శృంగార తార మియా మాల్కోవా, గ్యాంగ్‍స్టర్ దావూద్ ఇబ్రహీం, రష్యన్ రచయిత అయాన్ రాండ్‍తో పాటు సందీప్‍పై కూడా ఒట్టేస్తూ రిప్లై ఇచ్చారు. దీనికి సందీప్ వంగా, సర్.. అంటూ దండం పెట్టే ఎమోజితో రిప్లై ఇచ్చారు.

 

#ram-gopal-varma #director-sandeep-reddy-vanga
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe