Game changer:ఎంతకు తెగించార్రా..కేబుల్ టీవీలో గేమ్ ఛేంజర్ HD ప్రింట్

గేమ్ ఛేంజర్ మూవీ మేకర్స్కు బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ ఏపీలోని కేబుల్ టీవీలో ప్రసారం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ లోకల్ టీవీ ఛానల్లో హెచ్ డీ ప్రింట్ను ప్రసారం చేస్తున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

New Update
game changer in tv

game changer in tv

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ మిక్సుడ్ టాక్ తో దూసుకుపోతుంది.  ఈ క్రమంలో ఈ సినిమాకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సినిమాను పైరసీ బూతం వెంటాడింది.  హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చింది.  తమిళ్‌రాకర్స్, మూవీరూల్స్, ఫిల్మీజిల్లా, టెలిగ్రాం,ఐబోమ్మ లాంటి వెబ్ సైట్లలో ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. 

ఆ ప్రింట్ ను సంక్రాంతికి ఊరెళ్తున్న వారికోసం ఇటీవల బస్సుల్లో టెలికాస్ట్ కూడా చేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  తాజాగా ఈ మూవీ ఏపీలోని కేబుల్ టీవీలో ప్రసారం అవుతున్నట్లుగా తెలుస్తోంది.  ఏపీ లోకల్ టీవీ ఛానల్ లో   హెచ్ డీ ప్రింట్ ను ప్రసారం చేస్తు్‌న్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై మేకర్స్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

 సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు 

ఈ సినిమా విడుదలైన రోజు నుంచే  తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమాని లీక్‌ చేస్తామంటూ కొందరు బెదిరించగా వారిపై చిత్ర బృందం ఇటీవల సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా సినిమాపై సోషల్‌ మీడియా వేదికగా నెగెటివిటీ సృష్టిస్తున్న వారిపై కూడా కంప్లైంట్‌ ఇచ్చింది.

గేమ్ ఛేంజర్‌లో రామ్ రామ్ నందన్ అనే IAS అధికారిగా అప్పన్న అనే పాత్రలో నటించాడు. కియారా  దీపికగా నటించగా, అంజలి  పార్వతి అనే పాత్రలో కనిపించింది.  సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించారు.  పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించగా తమన్ సంగీతాన్ని అందించారు.  

Also Read :  కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో విచారణకు హోంశాఖ గ్రీన్ సిగ్నల్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు