Peddi Update: శ్రీలంకలో 'పెద్ది' టీమ్.. సాంగ్ షూట్ అప్డేట్ అదిరిపోయింది!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' షూటింగ్ తో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.  'ఉప్పెన' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. 

New Update
peddi update

peddi update

Peddi Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' షూటింగ్ తో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.  'ఉప్పెన' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.  ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఒక స్పోర్ట్స్ డ్రామా అంశంతో దీనిని రూపొందిస్తున్నారు. ఇప్పటికే 'పెద్ది' ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్ వీడియో విడుదలవగా.. రామ్ చరణ్ మేకోవర్ అదిరిపోయింది. ఇందులో రామ్ చరణ్ పక్కా పల్లెటూరి కుర్రాడిలా రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నారు. చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. విడుదలకు ముందు నుంచి వరుస అప్డేట్లు వదులుతూ సినిమాకు  ఫుల్ హైప్ ఎక్కిస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ క్రమంలో మరో అప్డేట్ పంచుకున్నారు. 

శ్రీలంకలో నెక్స్ట్ షెడ్యూల్ 

ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈరోజు నుంచి శ్రీలంకలో ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.  ఈ షెడ్యూల్ లో జాన్వీ- రామ్ చరణ్ పై అదిరిపోయే ఓ మాస్ బీట్ తెరకెక్కించనున్నారు. ఈ పాటను మెగా ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ లా ఉండబోతుందని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యింది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్స్ లో విడుదల కానుంది. 

Also Read: Allu Arjun: మైండ్ బ్లోయింగ్ .. రిషబ్ శెట్టి 'కాంతారా' ను ఆకాశానికెత్తిన అల్లు అర్జున్! పోస్ట్ వైరల్

Advertisment
తాజా కథనాలు