Peddi Update: 'పెద్ది' పోరాటం..! ఫ్యాన్స్ కు క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ క్లైమాక్స్ షూటింగ్‌లో ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 27న విడుదల కానున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

New Update
Peddi Update

Peddi Update

Peddi Update: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ షూటింగ్ పూర్తి దశలో ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలోని స్పోర్ట్స్ రివేంజ్ డ్రామా. సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ ఇప్పటికే ఫైనల్ కట్ లాక్ చేసారు మేకర్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ అధికారికంగా మార్చి 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

పెద్ది పాన్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘ఉప్పెన’తో గుర్తింపు పొందిన బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మాతలుగా ఉన్నారు. రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేంద్ర శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం కోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ను తీసుకున్నారు.

తాజాగా విడుదలైన పోస్టర్లు, ‘చికిరి చికిరి’ పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఫోక్ టచ్‌తో కూడిన ఎనర్జిటిక్ రిథమ్, రామ్‌చరణ్ మాస్ లుక్, బాడీ లాంగ్వేజ్ వల్ల ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. రీల్స్, షార్ట్ వీడియోల రూపంలో ఫ్యాన్స్ ఈ పాటను విపరీతంగా షేర్ చేస్తున్నారు, దాంతో ‘పెద్ది’పై ఉన్న నమ్మకం బలంగా పెరిగింది.

సినిమా క్లైమాక్స్ కోసం ప్రత్యేక సెట్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. సెకండ్ హాఫ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. యూనిట్ ఈ నెలాఖరు వరకు టాకీ పార్ట్‌ను పూర్తి చేయడానికి యత్నిస్తోంది.

ఇక విడుదల కోసం మేకర్స్ అధికారికంగా మార్చి 27న నిర్ణయించారు. రామ్‌చరణ్ అభిమానులు ఈ భారీ చిత్రం కోసం భారీ అంచనాల‌తో ఎదురుచూస్తున్నారు. కథ, మ్యూజిక్, ఎమోషన్, యాక్షన్ కలిపి ‘పెద్ది’ రామ్‌చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందని ఆశిస్తున్నారు. 

మొత్తంగా, ‘పెద్ది’ ఒక గొప్ప ఎంటర్‌టైనర్‌గా, ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించే హంగామా సినిమా అవుతుంది అని అంచనా. పెద్ద సెట్‌లు, యాక్షన్, సాంగ్ హిట్‌లు, స్టార్ కాస్ట్ వల్ల సినిమా మార్కెట్లో భారీ క్రేజ్ దక్కించుకుంటుంది. 

Advertisment
తాజా కథనాలు