Ram Charan: స్టార్ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల తన రెండవ సినిమతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. నేషనల్ అవార్డు విన్నర్, 'కలర్ ఫొటో' మూవీ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో 'మోగ్లీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేత ట్రైలర్ లాంచ్ చేయించారు. ట్రైలర్ లాంచ్ అనంతరం చరణ్ చిత్రబృందంతో కలిసి ముచ్చటించారు. టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. అలాగే సినిమా ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసించారు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రాఫీ, ఎలివేషన్స్ చాలా బాగున్నాయని అభినందించారు. ముఖ్యంగా లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Elated and blessed to spend valuable moments with Global Star @AlwaysRamCharan Garu ✨
— People Media Factory (@peoplemediafcy) August 31, 2025
He launching “𝐓𝐇𝐄 𝐖𝐎𝐑𝐋𝐃 𝐎𝐅 𝐌𝐎𝐖𝐆𝐋𝐈”, his words of appreciation mean the world to us ❤️
Thank you, sir ❤🔥
▶️ https://t.co/oPLxZcFlOr
A @SandeepRaaaj directorial.
🌟ing… pic.twitter.com/9IGIvGuvdv
నాని వాయిస్ ఓవర్..
'కలర్ ఫొటో’ ఫేం సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాని వాయిస్ ఓవర్ తో విడుదల చేసిన “ది వరల్డ్ ఆఫ్ మోగ్లీ” గ్లింప్స్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచింది. ఫ్రెష్ ఫీల్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ముఖ్యంగా నాని వాయిస్ ఓవర్ తో చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. ఇందులో రోషన్ కి విలన్ గా బండి సరోజ నటించడం విశేషం.' కలర్ ఫొటో' తో నేషనల్ అవార్డు కొల్లగొట్టిన సందీప్ .. ఇప్పుడు మోగ్లీ తో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ విజేత కుమారుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు కాల భైరవ సంగీతం అందించారు. RRR చిత్రానికి అసిస్టెంట్ DOP గా వర్క్ చేసిన రామా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఇదిలా ఉంటే రోషన్ 'బబుల్ గమ్ ' సినిమతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి 'కృష్ణ అండ్ హీజ్ లీలా' ఫేమ్ రవికాంత్ పేరుపు దర్శకత్వం వహించారు. తొలి సినిమాతోనే రోషన్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో రోషన్ నటన, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా యూత్ ని అలరించింది. ఈ చిత్రాన్ని కూడా పీపుల్ మీడియా ఫాక్టరీ నిర్మించింది.