Varun Tej Baby: వరుణ్ కొడుకు కోసం రామ్ చరణ్- ఉపాసన అదిరిపోయే సర్ప్రైజ్! ఏంటో తెలుసా

వరుణ్ తేజ్ - లావణ్యకు పండంటి మగబిడ్డ పుట్టిన సందర్భంగా రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలుపుత పోస్ట్ పెట్టారు. '' ప్రియమైన వరుణ్, లావణ్య, మీ ప్రియమైన చిన్నారి కోసం నా అభినందనలు. మీ ఇద్దరు ఈ అద్భుతమైన అధ్యాయాన్ని మొదలు పెడుతుండడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.

New Update
Ram Charan

Ram Charan

Varun Tej Baby: వరుణ్ తేజ్ - లావణ్య దంపతులు నిన్న  పండంటి మగబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. ఈ గుడ్ న్యూస్ తో మెగా కుటుంబంలో ఆనందం వెల్లువెత్తింది. మెగా కుటుంబం మూడో తరంలో పుట్టిన మొదటి మగబిడ్డ కావడంతో అందరూ సంతోషంలో మునిగిపోయారు. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ తో పాటు ఇతర  కుటుంబ సభ్యులంతా లావణ్య వరుణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  మెగాస్టార్  చిరంజీవి తన షూటింగ్‌ను ఆపేసి నేరుగా ఆసుపత్రికి వెళ్లి  మనవడిని చూసి మురిసిపోయారు. బాబును ఎత్తుకొని ఫొటోలు దిగారు. శుభవార్తతో మెగా కుటుంబంతో పాటు అభిమానుల్లో కూడా ఆనందం వెల్లివిరిసింది.

రామ్ చరణ్ అదిరిపోయే సర్ప్రైజ్ 

ఇక  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ  బుజ్జి బాబుకు వెల్కమ్ చెబుతూ పోస్ట్ పెట్టారు. '' ప్రియమైన వరుణ్,  లావణ్య, మీ ప్రియమైన చిన్నారి కోసం నా అభినందనలు ❤️❤️! మీ ఇద్దరు ఈ అద్భుతమైన అధ్యాయాన్ని మొదలు పెడుతుండడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీ బిడ్డ మీ ఇద్దరితో పాటు మన కుటుంబానికి కూడా ఎంతో ఆనందాన్ని తీసుకురావాలి. మీ ముగ్గురికి దేవుడి అశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి'' అంటూ ట్వీట్ చేశారు. ఈ బుల్లి ప్రిన్స్  రాకతో రామ్ చరణ్- ఉపాసన పెదనాన్న, పెద్దమ్మలుగా ప్రమోట్ అయ్యారు. అంతేకాదు తమ బుజ్జి వారసుడి కోసం రామ్ చరణ్ -ఉపాసన దంపతులు  అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారాట! ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది మాత్రం ఇంకా ఎవరికీ తెలియదు. 

అలాగే అల్లు అర్జున్ బుజ్జి బాబు పుట్టిన సందర్భంగా వరుణ్- లావణ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. బుజ్జి బాబు పుట్టిన సందర్భంగా  వరుణ్- లావణ్యకు హృదయపూర్వక అభినందనలు. ఈ అందమైన కొత్త ప్రయాణంలో మీ ఇద్దరికి అంతులేని ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. 

Also Read:Kishkindhapuri: ఆడియన్స్ అలా చేస్తే ఇండస్ట్రీనే వదిలేస్తా! బెల్లంకొండ శ్రీనివాస్ షాకింగ్ ఛాలెంజ్

Advertisment
తాజా కథనాలు