Kishkindhapuri: ఆడియన్స్ అలా చేస్తే ఇండస్ట్రీనే వదిలేస్తా! బెల్లంకొండ శ్రీనివాస్ షాకింగ్ ఛాలెంజ్

థియేటర్లో ఆడియన్స్ ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీనే వదిలేస్తా అంటూ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఆయన ఎందుకు ఇలా అన్నారో ఇక్కడ తెలుసుకోండి.

author-image
By Archana
New Update

Kishkindhapuri: థియేటర్లో ఆడియన్స్ ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీనే వదిలేస్తా అంటూ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అయితే శ్రీనివాస్- అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన 'కిష్కిందపురి' చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ లో  బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో శ్రీనివాస్ మూవీ పై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఛాలెంజ్ చేశారు. థియేటర్స్ లో కిష్కిందపురి సినిమా చూసే సమయంలో ప్రేక్షకులు ఎవరైనా బోర్ ఫీలై ఫోన్ పట్టుకుంటే తాను  ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతా అంటూ ఛాలెంజ్ విసిరారు. 

శ్రీనివాస్ మాట్లాడుతూ.. రెండు గంటల పాటు మనల్ని మనం మర్చిపోయేలా చేసేది సినిమా. సో థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు ఆ రెండున్నర గంటలు ఫోన్ చూడలేదంటే ఆ సినిమా సక్సెస్ అని అర్థం! ఇప్పుడు మేం చేసిన కిష్కిందపురి కూడా అలాంటి చిత్రమే. ఈ మూవీకి  వచ్చిన ఆడియన్స్ మొదటి పది నిమిషాల తర్వాత ఎవరైనా ఫోన్ పట్టుకుంటే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాను. ఖచ్చితంగా ఎవరూ ఫోన్ చూడరని ఛాలెంజ్ చేసి చెప్పగలను.. అంత ఆసక్తిగా ఉంటుంది 'కిష్కిందపురి' కథ అంటూ సినిమా పై నమ్మకాన్ని వ్యక్తం చేశారు హీరో శ్రీనివాస్. మరి మన హీరో చెప్పినట్లుగా  'కిష్కిందపురి' ఆడియన్స్ ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుండగా? లేదా అనేది తెలియాలంటే  ఇంకా 24 గంటలు వెయిట్ చేయాల్సిందే.  మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'కిష్కిందపురి' చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.

ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ఇతర ప్రచార చిత్రాలు విడుదల కాగా.. సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఫుల్ సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ ట్రైలర్ సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేసింది. చూస్తుంటే బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో ఇదొక మంచి హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. చైతన్య భరద్వాజ సంగీతం అందించారు. 

సినిమా కథ ఏంటి.. 

ఒక రియాల్టీ షో పేరుతో దయ్యాల పై ఆసక్తి ఉన్నవారందరినీ 'కిష్కిందపురీ' లోని ఒక బంగ్లాకి తీసుకెళ్తారు. కానీ, అక్కడ నిజంగానే దెయ్యం ఉంటుంది. అది అనుపమ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత హీరో ఆ ఆత్మ నుంచి అనుపమను ఎలా బయట పడేశాడు? అసలు అనుపమకు ఆ ఆత్మతో ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమా కథగా ఉండబోతుందని తెలుస్తోంది.

Also Read: Kurukshetra Web Series: "కురుక్షేత్ర" సిరీస్.. 'మహావతార్‌ నరసింహ’ను మించేలా ప్లాన్..!

Advertisment
తాజా కథనాలు