COOLIE OTT: రజినీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో గతనెల 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రజినీకాంత్ స్క్రీన్ ప్రజెన్స్ తప్పా సినిమా కథ, కథనం బలంగా లేదని విమర్శలు వచ్చాయి. విక్రమ్, ఖైదీ, మాస్టర్ సినిమాల్లో కనిపించిన లోకేష్ మార్క్ 'కూలీ' కనిపించలేదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. కథ పరంగా మెప్పించనప్పటికీ.. రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్ హీరోల ఇమేజ్ తో కమర్షియల్ గా బాగానే సక్సెస్ అయ్యింది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఓటీటీలో కూలీ
సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ తర్వాత ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 11 నుంచి 'కూలీ' అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేసింది.
#Coolie digital premieres September 11 on Prime Video.
— Ott Updates (@Ott_updates) September 4, 2025
Starring - Rajinikanth, Nagarjuna, Sathyaraj, Upendra, Sruthi Hassan Soubin & Rachita Ram.#CoolieOnPrimepic.twitter.com/d8m8vuO44G
స్టార్ కాస్ట్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజినీకాంత్ హీరోగా నటించగా..కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున , రచిత రామ్, సముద్రఖని , శృతి హాసన్ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రలు పోషించారు. పూజ హెగ్డే మోనికా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ పాటలో పూజ, సౌబిన్ స్టెప్పులు ఎనర్జీ అదిరిపోయాయి. ఈ పాట సినిమాకే హైలెట్ గా నిలిచింది. కానీ, సినిమాలో ఈ సాంగ్ వచ్చిన టైమింగ్ సరిగ్గా లేదని విమర్శలు వచ్చాయి. ఇక అనిరుద్ రవిచంద్రన్ ఎప్పటిలాగే తన మ్యూజిక్ తో అదరగొట్టారు. రీసెంట్ గా విడుదలైన రజనీకాంత్ సినిమాలు అన్నింటికీ అనిరుద్ మ్యూజిక్ అందించారు. ముఖ్యంగా జైలర్ లో అనిరుద్ bgm టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
‘కూలీ’ సినిమాకు తమిళ్ భాషలో అత్యధిక వసూళ్లు లభించాయి. తమిళనాడులో రజనీకాంత్‌కు క్రేజ్ ఫాలోయింగ్ వల్ల, సినిమా అక్కడ భారీ వసూళ్లతో సాధించింది. అలాగే తెలుగు భాషలో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. హిందీ, ఇతర భాషల్లో ఓ మోస్తారుగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అన్ని భాషలలోనూ సినిమా మంచి ఆదరణ పొందుతూ, బాక్సాఫీస్ వద్ద కమర్శియల్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ వార్ 2 కూడా అదే సమయంలో విడుదలైనప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీని ఇచ్చింది.
Also Read: Ghaati Advance Ticket Booking: అడ్వాన్స్ బుకింగ్స్ లో 'ఘాటీ' సంచలనం.. హాట్ కేకుల్లా టికెట్లు !