Coolie: 'కూలీ' లెక్కలు మారాయి! నెక్స్ట్ లెవల్ క్రేజ్ ఇది..

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ 'కూలీ' మూవీ ఆగస్టు 14న రిలీజ్ కు సిద్ధమైంది. అయితే, కూలీ తెలుగు వెర్షన్ హక్కుల కోసం మేకర్స్ రూ.40 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

New Update
Coolie

Coolie

Coolie: సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబోలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్  'కూలీ'పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్-ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న కూలీ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోకేష్ కనగరాజ్ ఈ మూవీని ఆగస్టు 14న  విడుదల చేయనున్నారు. అయితే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2 కూడా అదే డేట్ లాక్ చేసుకుంది. దీంతో కూలీ- వార్ 2 బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటం విశేషం. 

రూ.40 కోట్లు డిమాండ్

అయితే, కూలీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను దక్కించుకోవడానికి  సన్ పిక్చర్స్‌లోని కూలీ మేకర్స్‌తో ఏకంగా ఆరుగురు తెలుగు నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కూలీ తెలుగు వెర్షన్ హక్కుల కోసం మేకర్స్ రూ.40 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ డీల్ ను ఆరుగురు తెలుగు నిర్మాతలలో ఎవరు సొంతం చేసుకుంటారో త్వరలో తెలియనుంది.

Also Read:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

కూలీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  ర‌జినీ స‌ర‌స‌న పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. అలాగే, ఉపేంద్ర, స‌త్య‌రాజ్, శృతి హాసన్, బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కూడా క్యామియో పాత్ర‌లో కనిపించ‌నున్నారు. భారీ బ‌డ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. 

Also Read:ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

Advertisment
తాజా కథనాలు