/rtv/media/media_files/2025/11/21/thalaivar173-2025-11-21-19-47-34.jpg)
Thalaivar173
Thalaivar173: సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth), నటుడు-నిర్మాత కమల్ హాసన్(Kamal Haasan) జతకడుతోన్న కొత్త చిత్రం Thalaivar 173 ఇప్పటి నుంచే పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు అధికారికంగా బయటకు రాకపోయినా, మూవీ కాస్ట్ అండ్ క్రూ పై పెద్ద ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
ఇటీవల మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్‌ను, ఈ ప్రాజెక్ట్‌కు ఇళయరాజా సంగీతం అందించే అవకాశముందా? అని అడిగారు. దానిపై కమల్ చాలా స్పందిస్తూ,
“ఇది రజినీ గారి సినిమా. నాకొక్కడికి నిర్ణయం తీసుకునే హక్కు లేదు. నేను, రజినీ ఇద్దరం కలిసి మాట్లాడి నిర్ణయించాలి” అని స్పష్టం చేశారు. దీంతో ఇళయరాజా సంగీతం అందిస్తారా లేదా అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు.
డైరెక్టర్ సుందర్ C ఎందుకు తప్పుకున్నారో?
Thalaivar 173ను మొదట సుందర్ C దర్శకత్వం వహించబోతున్నారని అన్నారు. కానీ “అనుకోని కారణాలు” అంటూ ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీనిపై కమల్ హాసన్, “సుందర్ C గారు ప్రెస్ నోట్ ద్వారా కారణాలు చెప్పారు. దానిపై నాకు చెప్పడానికి మరేం లేదు” అని అన్నారు. అంతేకాక, తాను నిర్మాతగా చేస్తున్న పని - రజినీకాంత్‌గారికి నచ్చి మంచి కథను వెతకమని చెప్పారు.
“స్క్రిప్ట్‌పై రజినీ గారికి సంతృప్తి వచ్చే వరకు మేము ప్రయత్నం కొనసాగిస్తాం. ప్రస్తుతం మంచి కథను ఫైనల్ చేయడం జరుగుతోంది. కొత్త యువ దర్శకుడిని కూడా తీసుకురావచ్చు” అని తెలిపారు. అదే సమయంలో, “ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయని కథను చూపుతాం” అని కూడా హింట్ ఇచ్చారు.
సుమారు 25 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మరుదనాయకం’ బడ్జెట్ సమస్యలతో ఆగిపోయింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ కూడా షూటింగ్‌కు హాజరైన ఆ ప్రాజెక్ట్ గురించి కమల్ ఇప్పుడు మళ్ళీ ప్రస్తావన తెచ్చారు. “ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా ముందుకెళ్లింది. ఇప్పుడు మరుదనాయకం చేయడం పూర్తిగా సాధ్యం” అని కమల్ అన్నారు. ఈ మాటలతో ఆ సినిమా మళ్లీ మొదలయ్యే అవకాశముందనే ఉత్సాహం అభిమానుల్లో పెరిగింది.
కమల్ హాసన్ త్వరలో KH237 పేరుతో ఒక భారీ యాక్షన్ సినిమా చేయబోతున్నారు. దీనికి ‘కుంబలంగి నైట్స్’ రచయిత ష్యామ్ పుష్కరన్ స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
Follow Us