మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది.. కన్నీళ్లు పెట్టిస్తోన్న రాజేంద్ర ప్రసాద్ వీడియో కూతురి మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరవుతున్న ఓ వీడియో సోషల్ మీడియా వేదికగా బయటికొచ్చింది. అందులో కూతురి అంత్యక్రియలకు వెళ్తున్న సమయంలో ఎంతో ఎమోషనల్ అయ్యారు. మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది, పంపించేసి వస్తా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. By Anil Kumar 07 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఆయన కూతురు గాయత్రికి కార్డియాక్ అరెస్ట్ రావడంతో.. వెంటనే హైద్రాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. శనివారం ఉదయాన్నే మరణించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ ఇంటికి ఎంతోమంది సెలబ్రెటీస్ చేరుకొని.. గాయత్రికి నివాళులు నివాళి అర్పించారు. కూతురి ఆకస్మిక మరణంతో శోక సంద్రంలో మునిగిపోయిన రాజేంద్ర ప్రసాద్ ను పలువురు సినీ ప్రముఖులు ఓదార్చారు. గాయత్రీ కేవలం 38 సంవత్సరాలకే మరణించడం.. రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేసింది. మా అమ్మ మళ్లీ చనిపోయింది,పంపించొస్తా:రాజేంద్రప్రసాద్ భావోద్వేగం pic.twitter.com/5s7DBop2wo — Journalist Ashok Kumar Potta (@reporterpotta) October 7, 2024 మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది.. ఇదిలా ఉంటే కూతురి మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరవుతున్న ఓ వీడియో సోషల్ మీడియా వేదికగా బయటికొచ్చింది. అందులో తన కూతురి అంత్యక్రియలకు వెళ్తున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది. Also Read : మళ్ళీ విదేశాలకు మహేష్ బాబు.. సూపర్ స్టార్ స్టైలిష్ లుక్ వైరల్ పంపించేసి వస్తా, అంతకన్నా నేను చేయగలిగింది ఏమి లేదు. నా చేతుల్లో ఏమీ లేదు, జీవితంలో నేను సాధించింది, సంపాదించింది ఏమీ లేదంటూ తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో సీనియర్ నటి రమాప్రభతో పాటూ కుటుంబ సభ్యులు ఆయన్ని ఓదార్చారు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రాజేంద్ర ప్రసాద్ కు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. రాజేంద్రప్రసాద్ గారు 😢🥺🫂 pic.twitter.com/lrZI4BB6BZ — అభినవ్ కృష్ణ ୧⍤⃝💐░▒▓ (@Nee_Nimsaare) October 7, 2024 కాగా రాజేంద్ర ప్రసాద్ కు పదేళ్లున్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి తన కూతురిలోనే అమ్మను చూసుకున్నారు. అయితే ఆయన కూతురు మాత్రం తండ్రి మాట వినకుండా లవ్ మ్యారేజ్ చేసుకువడంతో రాజేంద్ర ప్రసాద్ కొన్నాళ్ళపాటు కూతురితో మాట్లాడలేదు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి