/rtv/media/media_files/2025/08/29/rajasaab-2025-08-29-18-51-55.jpg)
Rajasaab Censor
ఇప్పటి వరకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం, ది రాజా సాబ్ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సుమారు 183 నిమిషాలు, అంటే 3 గంటలు 3 నిమిషాల రన్‌టైమ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే సీబీఎఫ్‌సీ నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించిందని టాక్ వినిపిస్తోంది.
ఈ రన్‌టైమ్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ సినిమా కావడంతో అభిమానులు ఈ నిడివిపై ఆసక్తిగా చర్చిస్తున్నారు. అయితే ఈ వివరాలపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అందుకే ఫ్యాన్స్ అధికారిక కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎస్.ఎస్. తమన్ అందిస్తున్నారు. హీరోయిన్‌లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు.
రొమాన్స్, హారర్, కామెడీతో రూపొందుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో ఒక కొత్త అనుభవంగా ఉండబోతోందని అభిమానులు భావిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న 'ది రాజా సాబ్' సెన్సార్ వార్తలతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక వివరాలు వస్తే స్పష్టత రానుంది.
Follow Us