Baahubali 3: రాజమౌళి బాహుబలి 3 తీస్తాడా..? జక్కన్న ప్లాన్ ఇదే..!

రాజమౌళి బాహుబలి 3ను ఈసారి యానిమేటెడ్ ఫార్మాట్‌లో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. కథ, స్క్రిప్ట్ పనులు ఆయన పర్యవేక్షించనున్నారని సమాచారం. దీంతో బాహుబలి 3 కనీసం వెయ్యి కోట్ల వసూళ్లు రాబడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

New Update
Baahubali the Epic

Baahubali 3

Baahubali 3: బాహుబలి సిరీస్‌ సినిమాలు తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ప్రాజెక్ట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా రికార్డులు సృష్టించాయి. ఈ సిరీస్‌లో మూడో భాగం వస్తుందా అనే ప్రశ్న చాలా కాలంగా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రాజమౌళి దీనిపై ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. 

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో బాహుబలి 3 లైవ్ యాక్షన్‌గా రావడం కష్టం అని అర్థమవుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఈసారి కొత్త రీతిలో ఆలోచిస్తున్నారట.

జక్కన్న బాహుబలి 3ను యానిమేటెడ్ ఫార్మాట్‌లో రూపొందించాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కథ, స్క్రిప్ట్‌ పనులు ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారని సమాచారం. యానిమేషన్ టెక్నాలజీతో మహిష్మతి ప్రపంచాన్ని మళ్లీ చూపించాలన్న ఆలోచనతో రాజమౌళి ముందుకు వెళ్తున్నారని చెబుతున్నారు.

ఇటీవల విడుదలైన మహావతార్ నరసింహ అనే యానిమేటెడ్ చిత్రం భారీ హిట్‌గా నిలిచి, సుమారు రూ.350 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా విజయం యానిమేషన్ సినిమాలకు కూడా పెద్ద స్థాయి ఆదరణ ఉందని నిరూపించింది. అదే బాటలో బాహుబలి 3 వస్తే, ఇది కనీసం వెయ్యి కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బాహుబలి బ్రాండ్‌కీ, రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్‌కీ ఉన్న పేరు దృష్ట్యా, యానిమేటెడ్ వెర్షన్ అయినప్పటికీ ప్రేక్షకుల్లో భారీ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. జక్కన్న ఈ నిర్ణయం అభిమానులకు నిజంగా సంతోషకరమైన వార్త. మహిష్మతి సామ్రాజ్యాన్ని మరోసారి పెద్ద తెరపై ఈసారి యానిమేషన్ రూపంలో చూడబోతున్నామనే ఆలోచనే అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. బాహుబలి 3 ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాల్సిందే!

Advertisment
తాజా కథనాలు