Radhika Merchant : వ్యాపార దిగ్గజం ముఖేష్ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది జులై 12న జరిగిన అనంత్- రాధికా వివాహానికి ప్రపంచ నులుమూలల నుంచి వ్యాపార వేత్తలు, దేశాధినేతలు, ప్రముఖులు, క్రికెటర్లు, సినీ తారలు హాజరయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రెటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరి పెళ్లిలో అంబానీ కుటుంబం ధరించిన వస్త్రాలు, నగలకు సంబంధించిన వివరాలు ఫొటోలు, వీడియోలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ పెళ్ళికి అంబానీ కుటుంబం 5వేల కోట్లు ఖర్చు చేసింది.
Also Read: AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
పెళ్ళైన నాలుగు నెలలకు రాధికా కీలక నిర్ణయం
అయితే పెళ్ళైన నాలుగు నెలలకు రాధికా కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా అంబానీ కుటుంబంలో కలిసిపోయారు. ఇప్పటికీ తాను అంబానీ కోడలు అయినప్పటికీ.. అధికారికంగా తన పేరును మార్చుకున్నారు. ఆమె పేరులో మర్చంట్ తొలగించి అంబానీని చేర్చుకున్నారు. సాధారణంగా పెళ్ళైన తర్వాత అమ్మాయిలకు అత్తారింటి పేరు వస్తుంది.
ఇది ఇలా ఉంటే అనంత్ పెళ్ళిలో ముఖేష్ అంబానీ పలువురు బాలీవుడ్ స్టార్లకు కోట్లు విలువ చేసే వాచెస్ గిఫ్ట్ గా ఇచ్చారు. సల్మాన్ ఖాన్, రన్ వీర్ సింగ్, షారుక్ ఖాన్, రణ్ బీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలకు అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్' వాచ్ గిఫ్ట్ చేశారు. దీని ధర
రూ.2 కోట్ల పై మాటే.
Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్!
Also Read: HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా?