Pushpa-2: పుష్ప–2 ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప–2 ప్రీమి షో పడిపయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ఎవరో కూడా తెలిసిపోయింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. భారీ ధరకు హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 04 Dec 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప–2 సౌండ్‌తో థియేటర్స్ మోతెక్కిపోతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు థియేటర్లలో తెగ హడావుడి చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత బన్నీ సినిమా థియేటర్లో విడుదల అవ్వడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో కూడా తెలిసిపోయింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. భారీ ధరకు హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 250 కోట్లు ఇచ్చి సినిమాను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక పుష్ప–2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ కూడా వచ్చారని తెలుస్తోంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నారు. బన్నీ సంధ్య థియేటర్‌కు వస్తున్నాడని తెలుసుకున్న ఫాన్స్ భారీ సంఖ్యలో అక్కడికి వచ్చారు. దాంతో అక్కడ భారీ తోపులాట జరిగింది. పోలీసులు లాఠీ ఛార్జీ కూడా చేశారు. ఇదే థియేటర్‌కు వైసీపీ నేత శిల్పా రవిచంద్ర రెడ్డి కూడా వచ్చారు. Also Read: Movies: వైభవంగా చైతూ–శోభిత పెళ్లి..మురిసిపోయిన నాగార్జున మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి