ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప2' ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. విడుదలై రెండు వారాలు కూడా గడవకముందే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1300 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
సినిమాకు అంత ఆదరణ రావడంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా కీ రోల్ ప్లే చేసింది. అందులో శ్రీలీల చేసిన 'కిస్సిక్' అనే స్పెషల్ సాంగ్ యూత్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ పాటలో అల్లు అర్జున్ మాస్ స్టెప్స్ తో పాటూ శ్రీలీల ఓ రేంజ్ లో గ్లామర్ ఒలకపొసింది. దీంతో రిలీజ్ కు ముందే ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.
Feel the heat, embrace the vibe! 🔥💃🏻#Kissik full video is out now! 🎶🎶https://t.co/3MvxzoXAEX
— T-Series (@TSeries) December 19, 2024
An Icon Star @alluarjun & Dancing Queen @sreeleela14 dance treat 💥💥
A Rockstar @Thisisdsp's Musical Flash⚡⚡#KissikStep#Pushpa2TheRuleOnDec5th@iamRashmika @aryasukku… pic.twitter.com/b6p7V5c6FC
ఇక థియేటర్స్ లో ఈ సాంగ్ ను ఫ్యాన్స్ తో పాటూ నార్మల్ ఆడియన్స్ సైతం ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇక తాజాగా 'కిస్సిక్' సాంగ్ కు సంబంధించిన ఫుల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. టీ సిరీస్ తెలుగు యూట్యూబ్ ఛానెల్ లో ఈ సాంగ్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దుమ్ములేపుతోంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ రాబడుతూ దూసుకుపోతుంది.