PuriSethupathi సేతుపతి సినిమాపై పూరీ అదిరే అప్డేట్.. రంగంలోకి మరో స్టార్ యాక్టర్

పూరి జగన్నాథ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విజయ్ సేతుపతితో తెరకెరెక్కించనుట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. తాజాగా ఈమూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ లో స్టార్ యాక్టర్ విజయ్ కుమార్ బాగమైనట్లు అనౌన్స్ చేశారు.

New Update
puri sethupathi movie latest update

puri sethupathi movie latest update

Puri Sethupathi Update టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి ప్రాజెక్టు కోసం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో చేతులు కలిపారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రబృదం.. మూవీకి సంబంధించిన కాస్ట్ ని ఒకరి తర్వాత ఒకరిని పరిచయం చేస్తున్నారు. తాజాగా మరో స్టార్ యాక్టర్ ఈ ప్రాజెక్ట్ లో బాగమైనట్లు తెలిపారు. కన్నడ డైనమిక్ యాక్టర్ విజయ్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. 

డైరెక్టర్ గా కూడా పేరు

నటుడు విజయ్ కుమార్ ఒకప్పుడు కన్నడలో అనేక సూపర్ హిట్ చిత్రాలు చేశారు. దునియా, చందా, జంగ్లీ, జానీ మేరా నామ్ ప్రీతి మేరా కామ్, జయమ్మన మగా, మాస్తీ గుడి, సలగ, భీమా చిత్రాలలో ఆయన నటనకు ప్రసిద్ది చెందారు. అంతేకాదు విజయ్ కుమార్ కి ఉత్తమ నటుడిగా కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు దక్కాయి. నటుడిగా మాత్రమే కాదు డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. 2024 లో విడుదలైన  'భీమా' సినిమాలో మెయిన్ లీడ్ గా నటించడంతో పాటు దర్శకత్వం చేశారు.  

ఇప్పటికే ఇందులో సీనియర్ నటి టబు ఫీమేల్ లీడ్ గా నటించనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే టబు పాత్ర నెగిటివ్ షెడ్ లో ఉండనున్నట్లు సమాచారం. జూన్ లో ఈ సినిమా  షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స బ్యానర్ పై చార్మీ, పూరి జగన్నాథ్ కలిసి నిర్మిస్తున్నారు 

latest-news | cinema-news | cinema news in telugu | Puri Jagannadh -Vijay Sethupathi

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు