ప్రముఖ నిర్మాత శివరామకృష్ణ మళ్లీ అరెస్ట్..

ప్రముఖ నిర్మాత శివరామకృష్ణ మళ్లీ అరెస్ట్ అయ్యారు. భూఆక్రమణ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన ఆయన అనారోగ్య కారణాలతో బెయిల్ కోసం పిటిషన్ వేస్తే.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ పోలీసులు బెయిల్ రద్దు చేయాలని కోరడంతో శివరామకృష్ణ బెయిల్ ని కోర్టు కొట్టి వేసింది.

pp
New Update

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత శివరామకృష్ణ భూ ఆక్రమణ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నకిలీ పత్రాలు తయారు చేసి ప్రభుత్వ భూములను కాజేయాలని చూసినందుకు పోలీసులు నాలుగు రోజుల క్రితం అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. 

మళ్ళీ జైలుకి..

క్రమంలో పలు అనారోగ్య సమస్యలు కారణంగా బెయిల్ మంజూరు చెయ్యాలని శివరామకృష్ణ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇటీవలే పోలీసులు మరోసారి శివరామకృష్ణ బెయిల్ పిటీషన్ ని పునః పరిశీలించాలని కోర్టుని కోరడంతో శివరామకృష్ణ బెయిల్ ని కోర్టు కొట్టి వేసింది. దీంతో గురువారం నిర్మాత శివరామకృష్ణ ని మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read : అల్లు అర్జున్ కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. ఫ్యాన్స్ అంతా ఒక్కటే

హైదరాబాద్ లోని రాయదుర్గం పరిసర ప్రాంతంలో ఉన్న 84 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించాలని  నిర్మాత శివరామకృష్ణ ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలో స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ లో పని చేస్తున్న ఓ ఉద్యోగి నుంచి ల్యాండ్ సంబంధిత డాక్యుమెంట్లు తెప్పించి వాటికి డూప్లికేట్ చేసి ఆ 84 ఎకరాల ల్యాండ్‌ తనదేనంటూ క్లయిమ్ చేశాడు. 

2003 లోనే కోర్టులో కేసు..

కాగా ఈ ఇష్యూపై 2003లో అప్పటి ప్రభుత్వం నకిలీ పత్రాలపై కోర్టులో కేసు వేసింది. నాటి నుంచి ఈ కేసు కొనసాగుతుండగా.. సదరు ప్రభుత్వ భూమి కోసం హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేసింది. పూర్తి వాదనలు, సాక్షాదారాలు పరిశీలించిన తర్వాత.. శివరామకృష్ణ కోర్టుకు సమర్పించినవి నకిలీ పత్రాలు అని సుప్రీం కోర్టు తేల్చింది. 

Also Read : 'పుష్ప 2' రిలీజ్ డేట్ మారిందోచ్.. బన్నీ కొత్త లుక్ మాములుగా లేదుగా

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe