Kalki 2: ‘కల్కి 2’ సడెన్‌ సర్‏ప్రైజ్.. దీపికా స్థానంలో వారణాసి బ్యూటీ..?

‘కల్కి 2’లో దీపికా పదుకొనే లేకపోవడంతో సుమతి పాత్రకు కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. దీపికా డిమాండ్ల కారణంగా ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్టు టాక్. ఇప్పుడు ఈ పాత్రకు ప్రియాంక చోప్రా పేరు బలంగా వినిపిస్తోంది. అధికారికంగా ఇంకా ఎవరినీ ప్రకటించలేదు.

New Update
Kalki 2

Kalki 2

Kalki 2: 2024లో విడుదలైన ‘కల్కి 2898 AD’ భారత సినీ రంగంలో కొత్త రికార్డులు సృష్టించి, పాన్- ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సై-ఫై ఎపిక్‌లో ప్రభాస్(Prabhas), అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే కీలక పాత్రల్లో నటించారు. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹1,100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

దీపికా పాత్రకు షాకింగ్ ట్విస్ట్

మొదటి భాగంలో ‘సుమతి (SUM-80)’ పాత్రలో దీపికా చూపిన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. కానీ సెప్టెంబర్ 18, 2025 న వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటిస్తూ, దీపికా ‘కల్కి 2’లో భాగం కాదని తెలిపారు. వారి ప్రకటనలో ఇలా పేర్కొన్నారు.. 

“కల్కి 2898 AD సీక్వెల్‌లో దీపికా పదుకోన్ ఇక భాగం కాదు. సినిమా ప్రయాణం పెద్దది అయినా, సీక్వెల్ కోసం అవసరమైన కమిట్‌మెంట్ కుదరకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం.” అని తెలిపారు.

ఈ నిర్ణయం అభిమానులను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేసింది. దీపికా ఎందుకు తప్పుకున్నది? చాలా ప్రెశ్నలు తలెత్తాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, దీపికా 25% రెమ్యూనరేషన్ పెంపు, ప్రసవం తర్వాత రోజుకు 8 గంటలే పని చేసే షరతు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ డిమాండ్లు సినిమా బడ్జెట్, ప్లాన్‌కు సరిపోకపోవడంతో ఇద్దరి మధ్య అంగీకారం జరగలేదని సమాచారం.

దీపికా తప్పుకున్న వెంటనే కొత్త హీరోయిన్ ఎవరు అన్న చర్చ మొదలైంది. మీడియాలో వినిపించిన పేర్లు 

సాయి పల్లవి

అలియా భట్

అనుష్క శెట్టి

పూజా హెగ్డే

అనుష్క శర్మ

కృతి సనన్

ఐశ్వర్య రాయ్ బచ్చన్

Priyanka Chopra in Kalki 2

తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం, ప్రియాంక చోప్రాతో టీమ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు స్టార్ ఇమేజ్ ఉన్న ప్రియాంక ఈ పాత్ర చేస్తే సినిమా మరింత అంతర్జాతీయ స్థాయికి వెళ్తుందని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

‘బాజీరావ్ మస్తానీ’ సినిమాలో దీపిక- ప్రియాంక కలిసి నటించడంతో, ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా మళ్లీ చర్చకు వచ్చింది. ప్రియాంక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘వారణాసి’ సినిమాలో కూడా భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ‘కల్కి 2’ ప్రీ–ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. షూటింగ్ 2026లో ప్రారంభం కానుంది. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ మళ్లీ కలిసి స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. అయితే సుమతి పాత్రకు కొత్త నటి ఎవరు అనేది ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు.

ఈ కాస్టింగ్ మార్చడం ‘కల్కి 2’పై మరింత ఆసక్తి పెంచింది. ప్రియాంక చోప్రా ఎంపిక అయితే, ఇది భారత సినిమాను మరోసారి ప్రపంచస్థాయిలో నిలబెట్టే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు