/rtv/media/media_files/2025/07/30/prithviraj-sukumaran-wife-2025-07-30-12-04-34.jpg)
Prithviraj Sukumaran wife
Prithviraj Sukumaran: స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ భార్య సుప్రీయ మీనన్ ఏడేళ్లుగా వేధింపులకు గురవుతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే 2018 నుంచి ఇన్ స్టాగ్రామ్ లో ఓ మహిళా తనను వేధిస్తుందంటూ పోస్ట్ పెట్టింది. ఆమె ఉద్దేశపూర్వకంగా తన గురించి అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ ఆ మహిళ ఫొటోను పంచుకున్న సుప్రీయ మీనన్.. ఏ ఫిల్టర్ కూడా ఆమె పై తనకున్న ద్వేషాన్ని కప్పిపుచ్చలేకపోతుందని అసహనం వ్యక్తం చేశారు.
ఏడేళ్లుగా వేధింపులు
సుప్రీయ మీనన్ తన పోస్టులో ఇలా రాసుకొచ్చారు.. 2018 నుంచి ఈ మహిళ నాకు తెలుసు. అయితే ఆమెకు చిన్న బాబు ఉన్నాడనే ఒకేఒక కారణంతో ఇన్నాళ్లు నేను ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ, ఆమె ఇప్పుడు మా మధ్య లేని మా తండ్రి పై కూడా నిందలు వేస్తూ కామెంట్లు పెడుతోంది. ఇప్పటికే ఎన్నో సార్లు నేను ఆమె ఖాతాను బ్లాక్ చేయడం జరిగింది. అయినప్పటికీ కొత్త కొత్త ఖాతాలను సృష్టించుకొని నన్ను బాధపెట్టడమే ఆమె పనిగా పెట్టుకుంది. ఆమె క్రియేట్ చేసిన ప్రతీ అకౌంట్ బ్లాక్ చేయడం నా డైలీ రొటీన్ లో ఒక భాగమైపోయింది అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక స్టార్ హీరో భార్య ఇలా ఆన్ లైన్ వేధింపులకు గురికావడం చర్చనీయాంశంగా మారింది.
/filters:format(webp)/rtv/media/media_files/2025/07/30/supriya-menon-prithviraj-post-2025-07-30-12-20-10.png)
2011లో వివాహం
పృథ్వీ రాజ్ సుకుమారన్- సుప్రీయ మీనన్ 2011లో వివాహం చేసుకున్నారు. సుప్రీయ ఓ మీడియా సంస్థలో జర్నలిస్టుగా పని చేస్తున్న సమయంలో పృథ్వీ రాజ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. ప్రస్తుతం సుప్రియ పృథ్వీ రాజ్ ప్రొడక్షన్స్ పై సినిమాలు నిర్మిస్తూ.. నిర్మాతగా రాణిస్తున్నారు. సుప్రియ మీనన్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఈనెకు ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
పృథ్వీ రాజ్ సినిమాలు
ఇక పృథ్వీ రాజ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే 'ఎంపురాన్ 2' తో భారీ విజయాన్ని అందుకున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. రూ. 260 కోట్లకు పైగా వసూళ్లతో మలయాళం ఇండస్ట్రీలోనే హయ్యస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలిచింది. ప్రస్తుతం పృథ్వీ రాజ్ 'సలార్ పార్ట్ 2' తో పాటు రాజమౌళి 'SSMB29' సినిమాలు చేస్తున్నారు. 'SSMB29' లో పృథ్వీ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మలయాళంలో 'విలాయత్ బుద్ధు' ప్రాజెక్ట్ చేస్తున్నారు.
Also Read: Ana De Armas: 63 ఏళ్ల వయసులో హాట్ హీరోయిన్ తో టామ్ క్రూజ్ ప్రేమాయణం..