'PVCU' వరల్డ్ నుంచి కొత్త సినిమా ప్రకటన.. ఈసారి సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ తో

ప్రశాంత్ వర్మ.. 'PVCU' లో రానున్న తదుపరి సినిమాపై అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ యూనివర్స్‌ నుంచి మూడో చిత్రంగా 'మహాకాళీ' తెరకెక్కుతున్నట్లు వెల్లడించారు. టైటిల్‌ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ మూవీతో పూజా కొల్లురు దర్శకురాలిగా పరిచయం అవుతున్నట్లు తెలిపారు.

New Update

'హనుమాన్' మూవీతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీతో 'PVCU' పేరుతో ఓ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశాడు. ఈ యూనివర్స్ నుంచి ప్రతీ ఏడాది ఓ సినిమా వస్తుందని అన్నాడు. ఈ  సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి సుమారు 20 కథలు రెడీగా ఉన్నాయని ఆయన ఇప్పటికే చెప్పారు. దీంతో ప్రేక్షకులు ప్రశాంత్‌వర్మ తర్వాతి ప్రాజెక్ట్‌ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ తాజాగా పీవీసీయూలో రానున్న సినిమాపై అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ యూనివర్స్‌లో నుంచి మూడో చిత్రంగా 'మహాకాళీ' తెరకెక్కుతున్నట్లు వారు వెళ్లడించారు. టైటిల్‌ వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు.' మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. 

Also Read : కొండా సురేఖకు ఒకేసారి రెండు షాకులు..

కొత్త డైరెక్టర్ తో..

సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అని తెలిపారు. కాగా ఈ సినిమాను ప్రశాంత్ వర్మ కాకుండా తన టీమ్ నుంచి పూజా కొల్లురు దర్శకురాలిగా తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సినిమాలో నటించనున్న నటీనటులు ఎవరనే విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేయలేదు. 

త్వరలోనే ఆ వివరాలను తెలిపే అవకాశం ఉంది. ఇక ప్రశాంత్ వర్మ ప్రస్తుతం నందమూరి మోక్షజ్ఞతో సినిమా చేస్తున్నారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌  నుంచి రెండో ప్రాజెక్ట్‌గా  మోక్షజ్ఞ సినిమా రానుంది. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. 

#prasanth-varma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe