'హనుమాన్' మూవీతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీతో 'PVCU' పేరుతో ఓ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశాడు. ఈ యూనివర్స్ నుంచి ప్రతీ ఏడాది ఓ సినిమా వస్తుందని అన్నాడు. ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సుమారు 20 కథలు రెడీగా ఉన్నాయని ఆయన ఇప్పటికే చెప్పారు. దీంతో ప్రేక్షకులు ప్రశాంత్‌వర్మ తర్వాతి ప్రాజెక్ట్‌ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ తాజాగా పీవీసీయూలో రానున్న సినిమాపై అప్‌డేట్ ఇచ్చారు. ఈ యూనివర్స్‌లో నుంచి మూడో చిత్రంగా 'మహాకాళీ' తెరకెక్కుతున్నట్లు వారు వెళ్లడించారు. టైటిల్ వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు.' మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది.
On this auspicious occasion of Navratri, I’m thrilled to share something very special. Together with @RKDStudios, we proudly present the tale of an invincible warrior, the protector of the righteous, and the ultimate destroyer of evil 🔥
— Prasanth Varma (@PrasanthVarma) October 10, 2024
From the universe of #HanuMan ❤️🔥, prepare… pic.twitter.com/hDP8pFX9PE
Also Read : కొండా సురేఖకు ఒకేసారి రెండు షాకులు..
కొత్త డైరెక్టర్ తో..
సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అని తెలిపారు. కాగా ఈ సినిమాను ప్రశాంత్ వర్మ కాకుండా తన టీమ్ నుంచి పూజా కొల్లురు దర్శకురాలిగా తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సినిమాలో నటించనున్న నటీనటులు ఎవరనే విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేయలేదు.
త్వరలోనే ఆ వివరాలను తెలిపే అవకాశం ఉంది. ఇక ప్రశాంత్ వర్మ ప్రస్తుతం నందమూరి మోక్షజ్ఞతో సినిమా చేస్తున్నారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానుంది. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.