Dude Movie Trailer: ఇద్దరు హీరోయిన్లతో ప్రదీప్ రొమాన్స్.. సరికొత్త కాన్సెప్ట్‌తో డ్యూడ్ ట్రైలర్!

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మరో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీపావళి సందర్భంగా డ్యూడ్ మూవీతో అక్టోబర్ 17న థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.

New Update

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మరో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీపావళి సందర్భంగా డ్యూడ్ మూవీతో అక్టోబర్ 17న థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ప్రదీప్ ఎక్కువగా యువతను ఆకట్టుకునే కథలు చేస్తుంటారు. ఈసారి కూడా ఇలాంటి మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. డ్యూడ్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు. దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్లుగా మమిత బైజు, నేహా శెట్టి నటించారు. ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. యూత్‌ కనెక్ట్ అయ్యే పాయింట్స్ పట్టుకున్నారు.

ఇది కూడా చూడండి: Telusu Kada Trailer: స్టార్ బాయ్ సిద్ధు ‘తెలుసు కదా’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ టైం ఫిక్స్!

మూవీ డైలాగ్‌లు అదిరిపోయాయని..

ముఖ్యంగా ఇందులోని డైలాగ్‌లు అయితే అదిరిపోయాయని చెప్పవచ్చు. డైలాగ్స్, సినిమా స్టోరీ, దీనికి ప్రదీప్ మ్యానరిజం అయితే పీక్స్‌లో ఉంది. ప్రదీప్ ఈసారి కూడా హిట్ కొట్టబోతున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ మూవీలో కామెడీ, యాక్షన్, లవ్, రొమాన్స్ ఇలా అన్ని మిక్సింగ్ ఉన్నాయి. జరిగేది ఏదీ కూడా మన చేతిలో ఉండదనే పవర్ ఫుల్ డైలాగ్ యూత్‌ను మెప్పిస్తోంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చేలా ఉంది. ఎందుకంటే ఇందులో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి కూడా ఉంది. ఈమెకు యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. వీరి లవ్ ట్రాక్ సినిమాలో హైలెట్‌గా నిలిచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి మూవీ ఎలా ఉందో అక్టోబర్ 17న థియేటర్‌లో చూడాలి. 

ఇది కూడా చూడండి: Sobhita Dhulipala: హాట్ ఫోజులతో హీట్ పెంచేస్తున్న అక్కినేని కోడలు.. ఫొటోలు చూశారా?

Advertisment
తాజా కథనాలు