Prabhas: ఒకేసారి రెండూ చుట్టేస్తా అంటున్న డార్లింగ్..?

ప్రభాస్ 2026 ఫిబ్రవరిలో 'కల్కి 2898 AD పార్ట్ 2' షూటింగ్ ప్రారంభించి, అదే నెలలో 'స్పిరిట్' సినిమా షూట్‌లో కూడా పాల్గొననున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' 2027లో విడుదల కానుంది. 'కల్కి సీక్వెల్' భారీ యాక్షన్, VFXతో రూపొందనుంది.

New Update
Prabhas

Prabhas

Prabhas: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన రాబోయే సినిమాలతో బిజీ బిజీగా ఉండనున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల ఆయన నటించిన 'ది రాజా సాబ్' ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయినా, ఇప్పుడు ప్రభాస్ లైనప్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

వచ్చే కథనాల ప్రకారం, ప్రభాస్ కల్కి 2898 AD పార్ట్ 2(Prabhas Kalki 2) షూటింగ్‌ను 2026 ఫిబ్రవరి 2 నుంచి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి స్పిరిట్(Prabhas Spirit) సినిమా షూటింగ్‌లో చేరతారని టాక్. స్పిరిట్ షూట్ ముస్సోరీలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ వార్తలు నిజమైతే, ఫిబ్రవరి నెల మొత్తం ప్రభాస్‌కు విరామం లేకుండా షూటింగ్‌లతో నిండిపోయినట్టే. ఇదే సమయంలో ఆయన ఫౌజీ సినిమా పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే ఆయన ప్రాజెక్టులపై స్పష్టత వచ్చే అవకాశముంది.

స్పిరిట్ సినిమా విషయానికి వస్తే, ఇది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పోలీస్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ప్రభాస్‌తో పాటు త్రిప్తి డిమ్రి, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2027లో ఎక్కువగా ఎదురుచూసే సినిమాల్లో ఇది ఒకటి.

మరోవైపు, 2024లో సంచలన విజయం సాధించిన కల్కి 2898 ADకి సీక్వెల్‌గా వస్తున్న పార్ట్ 2 కూడా భారీ స్థాయిలో రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హై క్వాలిటీ VFX, భారీ యాక్షన్ సీన్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. కథ మొదటి భాగం క్లైమాక్స్ నుంచి కొనసాగుతూ, భైరవ, అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్), సుప్రీం యాస్కిన్ (కమల్ హాసన్) మధ్య పోరును మరింత లోతుగా చూపనుంది.

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మళ్ళీ నటించడం ఖరారైనప్పటికీ, దీపికా పదుకొణె ఈ భాగంలో ఉండరని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె స్థానంలో ఎవరు వస్తారనే విషయంపై ఇంకా అధికారిక సమాచారం లేదు. మొదటి భాగం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో, సీక్వెల్ ఇంకా పెద్ద బడ్జెట్‌తో, భారీ స్థాయిలో తెరకెక్కనుందని సమాచారం. విడుదలకు ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశముంది.

మొత్తంగా చూస్తే, వచ్చే రోజుల్లో ప్రభాస్ వరుస భారీ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

Advertisment
తాజా కథనాలు