Spirit vs Varanasi: మహేష్ ను టెన్షన్ పెడుతున్న ప్రభాస్.. ఒకే నెలలో ‘వారణాసి’ & ‘స్పిరిట్’ రిలీజ్..?

ప్రభాస్ ‘స్పిరిట్’, మహేష్ ‘వారణాసి’ 2027 మార్చిలో రాబోతున్న రెండు బడ్జెట్ భారీ సినిమాలు. టాలీవుడ్ స్టార్ పవర్, స్టార్ దర్శకులు, భారీ ప్రొడక్షన్ తో పాన్-ఇండియా మార్కెట్‌ను షేక్ చేస్తాయని అంచనా. ఈ సినిమాలతో బాలీవుడ్ కు టాలీవుడ్ నుండి గట్టి పోటీ ఉండనుంది.

New Update
Spirit vs Varanasi

Spirit vs Varanasi

Spirit vs Varanasi: టాలీవుడ్‌లో భారీ అంచనాలతో ఎదురుచూసే రెండు సినిమాలు ప్రభాస్(Prabhas) ‘స్పిరిట్’, మహేష్ బాబు(Mahesh Babu) ‘వారణాసి’. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు 2027 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తోంది.

స్పిరిట్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తృప్తి డిమ్రి హీరోయిన్‌గా మెరుస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ లుక్‌లో కనిపిస్తారు. దేశ భద్రత నేపథ్యంతో సెట్ అయిన ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ పోస్టర్ ఇప్పటికే ఇండస్ట్రీని షాక్ చేసింది.

ఇక మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘వారణాసి’, జక్కన్న దర్శకత్వంలో రూపొందుతోంది. టైటిల్ టీజర్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఐదు వేర్వేరు పాత్రల్లో కనిపిస్తారని టాక్. మూవీ హాలీవుడ్ స్థాయి ప్రోడక్షన్ విలువ కలిగిందని అంచనా వేస్తున్నారు.

రిలీజ్ షెడ్యూల్ ప్రకారం, ‘స్పిరిట్’ మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వారణాసి’ మార్చి 25న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు టాలీవుడ్ అభిమానులకు మార్చిలో భారీ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాయి.

‘స్పిరిట్’ - ‘వారణాసి’ పాన్-ఇండియా మార్కెట్‌ ను షాక్ చేస్తాయా..?

టాలీవుడ్‌లో మార్చి 2027లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రెండు భారీ అంచనాల సినిమాలు ‘స్పిరిట్’ - ‘వారణాసి’ ప్రేక్షకులను థియేటర్లలో ఆకట్టేలా చేస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తోంది.

టాలీవుడ్‌లో ఇప్పుడు ఆసక్తికర అంశం ఏంటంటే, మహేష్ బాబు- ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్, ప్రభాస్ కూడా హనూ రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పని చేయనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్,త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో, అల్లు అర్జున్ అట్లీ, లోకేష్ కనగరాజ్‌తో కొత్త ప్రాజెక్ట్స్‌లో నటించనున్నారు. రామ్ చరణ్ ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్‌తో కలిసి పనిచేయనున్నారు. ఇవన్నీ కూడా భారీ భారీ ప్రాజెక్టులే..

ఈ సినిమాలు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 1,000-1,500 కోట్లు వసూలు చేయగలిగే సామర్థ్యం ఉన్న సినిమాలు. కథ, స్టార్ పవర్,  దర్శకుల ప్రతిభతో, తెలుగు సినిమా రాబోయే సంవత్సరాల్లో పాన్ ఇండియా లెవెల్ లో మోత మోగించనున్నాయి..

ఇక బాలీవుడ్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రస్తుతం ఒత్తిడిలో ఉంది. రణవీర్ సింగ్ ‘ధురంధర్’ సక్సెస్ ఇచ్చినప్పటికీ, షారూక్ ఖాన్ ‘కింగ్’, సల్మాన్ ఖాన్ ‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’, ‘ధురంధర్ 2’ వంటి సినిమాలు బాలీవుడ్‌ నుండి టాలీవుడ్ కు గట్టి పోటీగా నిలవాలి. ప్రాంతీయ సినిమాలు, నేషనల్ సినిమాల మధ్య సరిహద్దులు చెరిపేస్తూ రాబోయే సంవత్సరాల్లో టాలీవుడ్ భారత్ సినిమా భవిష్యత్తును ఆకారీకరించేలా ఉంటుందని అంతా భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు