PRABHAS: చాలా కాలం తర్వాత లేడీ సూపర్ అనుష్క శెట్టి 'ఘాటీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆంద్రప్రదేశ్ - ఒడిశా బార్డర్ లో గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో స్వీటీని మూవీని ప్రమోట్ చేయడానికి ప్రభాస్ రఁగంలోకి దిగారు. రేపు రిలీజ్ సందర్భంగా 'ఘాటీ' రిలీజ్ ట్రైలర్ ని షేర్ చేస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. "ఘాటి టీజర్ చాలా ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉంది. ఈ పవర్ ఫుల్ పాత్రలో నిన్ను చూడటానికి వెయిట్ చేయలేకపోతున్నాను స్వీటీ'' అంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు ప్రభాస్. ప్రభాస్ పోస్టుతో సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయ్యింది.
అనుష్క- ప్రభాస్ జోడికి ఇండస్ట్రీలో ఒక సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బిల్లా నుంచి బాహుబలి వరకు వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రతీ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో స్వీటీ- ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్. 'బాహుబలి' తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. అనుష్క సినిమాను ప్రమోట్ చేస్తూ పోస్ట్ పెట్టడం ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగించింది.
" #Ghaati Release Trailer looks intense and intriguing... Can't wait to see you in this powerful role Sweety @MsAnushkaShetty. Best Wishes to the entire team!!!"
— Hail Prabhas (@HailPrabhas007) September 4, 2025
~ #Prabhas via Insta ❤️ pic.twitter.com/OsuukOxvWE
ఆంద్రప్రదేశ్ - ఒడిశా బార్డర్
ఆంద్రప్రదేశ్ - ఒడిశా బార్డర్ ప్రాంతంలో గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో అనుష్క శీలావతి అనే పాత్రలో కనిపించనుంది. ఒక సాధారణ మహిళగా ఉన్న ఆమె గంజాయి స్మగ్లింగ్ లో ఎలా చిక్కుకుంది? ఆ తర్వాత ఆ స్మగ్లింగ్ మాఫియాకి రాణిగా ఎలా ఎదిగింది? ఆ వ్యాపారంలోకి ఆమెను నెట్టిసిన పరిస్థితులు ఏంటి? ఇది కేవలం ఒక గంజాయి స్మగ్లింగ్ కథ మాత్రమే కాదు.. ఆ ప్రాంతంలోని సామాజిక అంశాలు పై కూడా దృష్టి సారిస్తుందని డైరెక్టర్ క్రిష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాల్లో అనుష్క పవర్ఫుల్ పాత్రలో, భయంకరమైన యాక్షన్ సన్నివేశాలు చేస్తూ కనిపించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇందులో అనుష్క జోడీగా విక్రమ్ ప్రభు నటించగా.. జగపతి బాబు, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు.
హాట్ కేకుల్లా టికెట్లు..
ఘాటీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమవగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్ లోని పలు థియేటర్స్ లో ఫస్ట్ డే ఫస్ట్ షోలన్నీ ఫుల్ అయ్యాయి. ఇక ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఘాటీ జోరు కొనసాగిస్తోంది. చాలా కాలం తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.