Rajasaab: 'రాజాసాబ్'కు అండగా ఫ్యామిలీ ఆడియన్స్.. నెగిటివ్ టాక్ కు చెక్ పడినట్టేనా..?

ప్రభాస్ ‘ది రాజాసాబ్’కు మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చినా, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. వింటేజ్ ప్రభాస్ కామెడీ, మారుతి దర్శకత్వం సినిమాకు బలంగా మారాయి. బుకింగ్స్ జోరుగా కొనసాగుతుండగా, కొత్త సీన్స్ యాడ్ చేయడం సినిమాకు మరింత బూస్ట్ ఇస్తోంది.

New Update
Rajasaab

Rajasaab

Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన తాజా సినిమా ‘ది రాజాసాబ్’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, క్రమంగా పాజిటివ్ టాక్ పెరుగుతోంది. ముఖ్యంగా నిన్న రాత్రి షోలు మంచి స్థాయిలో నడవడం, ఈ రోజు కూడా బుకింగ్స్ బాగా ఉండటం ట్రేడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ సినిమాకు ఇప్పుడు ప్రధాన బలం ఫ్యామిలీ ఆడియన్స్‌గా మారింది.

దర్శకుడు మారుతి ఈ సినిమాను హారర్ ఫాంటసీ జానర్‌లో తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. విజువల్స్, సెట్స్, మేకింగ్ పరంగా ఈ సినిమా గ్రాండ్‌గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. విడుదలైన మొదటి రోజు అభిమానులు అంచనాలు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని ఫ్యామిలీ ఆడియన్స్ అభిప్రాయం. కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమాను థియేటర్‌లో చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ప్రత్యేకంగా కుటుంబంతో కలిసి సినిమా చూడడానికి ఇది సరైన సినిమా అని చాలామంది అంటున్నారు. కథలో ఫాంటసీ అంశాలు, హారర్ టచ్, కామెడీ కలిసి ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యాయని టాక్. ఈ సినిమాలో ప్రభాస్‌ను వింటేజ్ స్టైల్‌లో చూసినట్టు ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఆయన కామెడీ టైమింగ్‌ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత కొంతకాలంగా సీరియస్ పాత్రల్లో కనిపించిన ప్రభాస్, ఈ సినిమాలో మాత్రం సరదాగా, నవ్వులు పంచుతూ కనిపించడం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది.

డైరెక్టర్ మారుతి తన సాధారణ జానర్‌కు భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించారని, అయిన కూడా ప్రభాస్‌ను సరిగ్గా చూపించడంలో సక్సెస్ అయ్యారని సినీ వర్గాలు అంటున్నాయి. పాన్ ఇండియా స్టార్‌తో పని చేయడం అంత సులభం కాదని, కానీ మారుతి ఆ ఛాలెంజ్‌ను బాగా ఎదుర్కొన్నారని ఫ్యాన్స్ అభిప్రాయం. కథనం, పాత్రల రూపకల్పన, కామెడీ సీన్స్‌ సినిమాను ఎంటర్‌టైనింగ్‌గా మార్చాయని చెబుతున్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న మంచి స్పందనతో ఈ రోజు కూడా ‘రాజాసాబ్’ బుకింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి. వీకెండ్‌కి సినిమా మరింత బలపడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి సీజన్ కావడంతో, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం సినిమాకు కలిసివచ్చే అంశంగా మారింది.

Rajasaab New Scenes

ఇక సినిమాకు మరింత బూస్ట్ ఇవ్వడానికి నేటి నుంచి కొన్ని కొత్త సన్నివేశాలను యాడ్ చేస్తున్నామని దర్శకుడు మారుతి ఇప్పటికే ప్రకటించారు. ఈ నిర్ణయం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. వింటేజ్ ప్రభాస్ కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్, పండుగ సీజన్ కలిసి ‘రాజాసాబ్’ సినిమాకు మంచి ప్లస్ అవుతున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. సరైన ప్రచారం కొనసాగితే, ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్‌లో ప్రభాస్‌కు మంచి విజయాన్ని అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు