Rajasaab Bookings: గెట్ రెడీ రెబల్స్.. 'రాజాసాబ్' నైజం బుకింగ్స్ ఎప్పుడంటే..?

సంక్రాంతికి విడుదలవుతున్న ప్రభాస్ ‘ది రాజా సాబ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 8న ప్రీమియర్స్, 9న రిలీజ్ ప్లాన్ చేశారు. నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ జనవరి 7న ప్రారంభమవుతాయని టాక్. రన్‌టైమ్ సుమారు 175 నిమిషాలు ఉండనుంది.

author-image
By Lok Prakash
New Update
Rajasaab Bookings

Rajasaab Bookings

Rajasaab Bookings: సంక్రాంతి సీజన్‌లో విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రభాస్(Prabhas) నటించిన 'ది రాజా సాబ్' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రభాస్ మళ్లీ హీరోగా పెద్ద తెరపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. హారర్ - ఫాంటసీ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. జనవరి 8న భారత్‌లో పెయిడ్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు.

దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కించగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరినా వహాబ్, యోగిబాబు, సప్తగిరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించగా, తమన్ ఎస్ సంగీతం అందించారు. సినిమా తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది.

Also Read: ముదురుతున్న శివాజీ - అనసూయ వివాదం...నటుడు సుమన్ ఏమన్నారంటే..?

ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. మరోవైపు విదేశాల్లో కూడా బుకింగ్స్ మంచి స్పందన తెచ్చుకుంటున్నాయి. ఉత్తర అమెరికాలో ప్రీ సేల్స్ ఇప్పటికే భారీ మొత్తాన్ని దాటినట్టు సమాచారం. ఇంకా ప్రీమియర్స్‌కు కొన్ని రోజులు సమయం ఉండగానే ఈ స్థాయి వసూళ్లు రావడం మేకర్స్‌కు ఉత్సాహాన్ని ఇస్తోంది.

ఇక నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ గురించి ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. జనవరి 7 నుంచి నైజాంలో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయని టాక్. దీంతో హైదరాబాద్ సహా మొత్తం ప్రాంతంలో థియేటర్ల వద్ద సందడి మొదలవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ సినిమా రన్‌టైమ్‌పై కూడా స్పష్టత వచ్చింది. మొదట సినిమా మూడు గంటలకుపైగా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం, ది రాజా సాబ్ ఫైనల్ రన్‌టైమ్ సుమారు 175 నిమిషాలు, అంటే దాదాపు 2 గంటలు 55 నిమిషాలుగా లాక్ చేసినట్టుగా మారుతి ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. ప్రేక్షకులు బోర్ కాకుండా కథ వేగంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Also Read: ప్రభాస్ నిజస్వరూపం బయటపెట్టిన బోమన్ ఇరానీ.. ఏమన్నారంటే..?

అయితే థియేటర్ల కేటాయింపుల విషయంలో ప్రభాస్ అభిమానుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. అదే సమయంలో విడుదలవుతున్న మరో సినిమా జన నాయకుడుకు హైదరాబాద్‌లో ఎక్కువ స్క్రీన్లు ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లలో ఆ సినిమాకు ప్రాధాన్యం ఇవ్వడం తమకు నచ్చడం లేదని అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉన్న ది రాజా సాబ్ కు తగినన్ని థియేటర్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జన నాయకుడు మల్టీప్లెక్స్ సంస్థల ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుండటంతో, హైదరాబాద్‌లోని మల్టీప్లెక్సుల్లో ఎక్కువ షోలు దక్కే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. ఈ కారణంగా ది రాజా సాబ్ కు పూర్తి స్థాయి లాభం దక్కుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఏదేమైనా, విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ది రాజా సాబ్ పై బజ్ మరింత పెరుగుతోంది. అభిమానులు మాత్రం ప్రభాస్ సినిమా థియేటర్లలో ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు