/rtv/media/media_files/2026/01/05/nache-nache-song-2026-01-05-16-36-30.jpg)
Nache Nache Song
Nache Nache Song: సంక్రాంతికి విడుదలవుతోన్న ప్రభాస్ 'ది రాజాసాబ్'(Raja Saab) సినిమా నుంచి 'నాచే నాచే' పాట లాంచ్ కార్యక్రమం ముంబయిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు బోమన్ ఇరానీ, ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు అందరిని ఆకట్టుకున్నాయి. పెద్ద స్టార్‌ల గురించి మనకు ఉండే అభిప్రాయాలకు భిన్నంగా ప్రభాస్ నిజ జీవితంలో ఎంత సింపుల్‌గా ఉంటాడో బోమన్ ఇరానీ తన మాటల్లో చెప్పాడు.
సాధారణంగా ఒక పెద్ద హీరోతో పని చేస్తే, అతని ప్రవర్తన కూడా స్టార్‌లా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ప్రభాస్ విషయంలో అది పూర్తిగా వేరేలా ఉందని బోమన్ తెలిపారు. షూటింగ్ సెట్స్‌లో ప్రభాస్ ప్రవర్తన చాలా సాధారణంగా, ఓ చిన్న అబ్బాయి లా ఉంటుందని ఆయన చెప్పారు. తన టీమ్‌తో, ఇతర నటులతో, చిన్న పాత్రలలో నటించే వారితో, టెక్నీషియన్లతో అందరితో ఒకేలా మాట్లాడతాడని వివరించారు.
Boman Irani About Prabhas
Boman Irani talks about Prabhas,
— Rineeth RebelWood (@rineethrebel) January 5, 2026
He has Larger than Life Aura. 🔥
Prabhas talks like a Young boy, he is enjoying his Super Stardom but he not putting it on his face.
India’s Biggest Superstar 🙌#Prabhas#TheRajaSaab#NacheNachepic.twitter.com/1LnHG26ZKs
బోమన్ మాట్లాడుతూ, “ప్రభాస్ ఒక పెద్ద సూపర్‌స్టార్ అయినా కూడా, తనను అలా ప్రత్యేకంగా ట్రీట్ చేయాలని ఆయన కోరుకోడు. మనం ఆయన స్టార్ అని గుర్తిస్తాం, కానీ ఆయన మాత్రం అందరికీ సమానంగా ఉండాలని చూస్తాడు” అని అన్నారు. ఈ మాటలు అక్కడ ఉన్న వారిని బాగా ఆకట్టుకున్నాయి.
ఇంకా ప్రభాస్‌లో ఉన్న అమాయకత్వం గురించి కూడా బోమన్ మాట్లాడారు. ఇంతటి పేరు, విజయాలు వచ్చినా కూడా, ఆయనలో ఒక చిన్నపిల్లలలాంటి స్వభావం కనిపిస్తుందని చెప్పారు. “అతను సరదాగా జోక్‌లు చేస్తాడు, ఎవరు ఏదైనా ఫన్నీగా చెప్పినా గట్టిగా నవ్వుతాడు. అతని నవ్వు చాలా సహజంగా ఉంటుంది. చూస్తే ఇప్పటికీ ఒక టీనేజర్‌లా అనిపిస్తాడు” అని బోమన్ అన్నారు.
సెట్‌లో ప్రభాస్ నవ్వు ఉంటే, ఆ వాతావరణం మొత్తం మారిపోతుందని, అందరికీ పని చేయడం ఇంకా సులభంగా అనిపిస్తుందని కూడా ఆయన చెప్పారు. అంత పెద్ద స్థాయికి చేరుకుని కూడా ఈ విధంగా సింపుల్‌గా ఉండటం చాలా అరుదైన విషయం అని బోమన్ అభిప్రాయపడ్డారు. “ఇంత ఎత్తుకు వెళ్లి కూడా తన అమాయకత్వాన్ని నిలుపుకోవడం చాలా గొప్ప విషయం. నేనూ అలా ఉండాలని కోరుకుంటాను” అంటూ ప్రభాస్‌ను ప్రశంసించారు.
ఇక 'ది రాజాసాబ్' సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, సంజయ్ దత్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రభాస్ సింపుల్ స్వభావం గురించి బోమన్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Follow Us