ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘రాజాసాబ్’ టీజర్‌కు డేట్ ఫిక్స్!

ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఈ మూవీ టీజర్ అప్డేట్ వైరల్ అవుతుంది. అక్టోబర్ 23న ఈ సినిమా టీజర్ రిలీజ్ అవుతుందంటూ టాక్ వినిపిస్తోంది.

Raja Saab
New Update

రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘సలార్’ మూవీతో ప్రభాస్ ఫాంలోకి వచ్చాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ఇక ఈ మూవీ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ మూవీ చేశాడు. 

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో ప్రభాస్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఉంది. అన్నింటికంటే దర్శకుడు నాగ్ అశ్విన్ తన క్రియేటివిటీ, విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. 

ఇది కూడా చదవండి: సురేఖ సిగ్గు లేకుండా మాట్లాడింది: అక్కినేని అఖిల్ ఫైర్

అంతేకాకుండా ఇందులో భారీ తారగణం నటించడంతో సినీ ప్రియులు థియేటర్లకు పరుగులు తీశారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి నటీనటులు ప్రధాన పాత్రలో కనిపించగా.. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాజమౌళి, ఆర్జీవి సహా తదితర దర్శక హీరోలు కీలక పాత్రలో నటించి అదరగొట్టేశారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.1200 కోట్లు రాబట్టింది. 

టీజర్ అప్డేట్

ఇదే జోష్‌లో ప్రభాస్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మారుతి దర్శకత్వలో ‘రాజాసాబ్’ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఇప్పుడు మరో అదిరిపోయే అప్డేట్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ‘రాజా సాబ్’ టీజర్‌పై ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ నెల అంటే అక్టోబర్ 23న ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో అఫీషియల్ అప్డేట్ రానుంది.
 
కాగా ఇందులో ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో మాళవికా మోహన్ ఒకరు కాగా.. మరొకరు నిధి అగర్వాల్. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన పోస్టర్‌లను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే వచ్చే నెల అంటే నవంబర్‌లోగా ప్రభాస్ తన పార్ట్‌ను పూర్తి చేయబోతున్నాడని సమాచారం. 

#prabhas #director-maruthi #raja-saab-teaser
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe