/rtv/media/media_files/2025/11/03/raja-saab-2025-11-03-09-31-13.jpg)
Raja Saab
Raja Saab: డార్లింగ్ ప్రభాస్(Prabhas) ఇప్పటివరకు చేయని కొత్త జానర్‌లో అడుగు పెడుతున్నాడు. ఈసారి ఆయన మారుతితో కలిసి ఓ విభిన్నమైన హారర్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా పేరు ‘రాజా సాబ్’. ఇది ప్రభాస్, మారుతి ఇద్దరి కెరీర్‌లకు కూడా కీలకమైన ప్రాజెక్ట్.
ఇటీవలి కాలంలో వరుసగా పాన్‌ఇండియా సినిమాలతో ప్రభాస్ పెద్ద స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. అలాంటి సమయంలో ‘రాజా సాబ్’ ఎలా ఉంటుందో అన్న ఉత్సాహం అభిమానుల్లో ఎక్కువగా ఉంది. మరోవైపు, గతంలో కొన్ని సినిమాలు ఆశించినంతగా రాణించకపోయిన మారుతికి ఈ సినిమా చాలా మంచి అవకాశం అని చెప్పాలి.
కానీ ప్రస్తుతం సినిమా ప్రమోషన్ల విషయంలో కొంత క్లారిటీ మిస్ అవుతోంది. ప్రభాస్‌కు ఉత్తర భారతదేశం, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మంచి ఇమేజ్ ఉన్నా, ఆ మార్కెట్లను సరిగ్గా ఉపయోగించుకోవాలంటే పెద్ద స్థాయిలో ప్రచారం అవసరం. ఇప్పటివరకు ప్రమోషన్లు నెమ్మదిగా సాగుతుండటంతో అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
‘రాజా సాబ్’ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుండటంతో, ఇప్పుడు నుంచే బలమైన ప్రచారం ప్రారంభిస్తేనే సినిమా బజ్ పెరగనుంది. ఈసారి దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా భారీగా రిలీజ్ చేయాలన్న ప్లాన్‌లో టీమ్ ఉంది. అందుకే ఆ స్థాయికి తగిన ప్రమోషనల్ ప్లాన్ అవసరం.
ప్రభాస్ అమెరికా ప్రమోషన్లలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం. అయితే భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా అతడు చురుకుగా పాల్గొనాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సాంగ్ రిలీజ్‌లు వంటి వాటితో మంచి హైప్ క్రియేట్ చేయాలన్న ఆలోచన టీమ్‌లో ఉంది.
డిసెంబర్‌లో పాటలు విడుదల చేసి, జనాల్లో సినిమా మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేయాలనుకున్నప్పటికి సాంగ్ మాత్రం రిలీజ్ కాలేదు.
ఇప్పటివరకు యాక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన ప్రభాస్ ని ఈసారి భిన్నంగా హారర్ కామెడీ పాత్రలో చూడనున్నారు. ఇటీవల ఉత్తరాదిలో వచ్చిన ‘భూల్ భులయ్యా 2’, ‘స్త్రీ 2’, ‘ముంజ్య’ వంటి హారర్ సినిమాలు పెద్ద హిట్లు కావడంతో, ‘రాజా సాబ్’ పట్ల కూడా పాజిటివ్ బజ్ ఏర్పడింది. ప్రభాస్ స్టార్డమ్, సరైన ప్రమోషన్లు కలిస్తే ఈ చిత్రం థియేటర్ల వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది.
మొత్తం మీద, హారర్ జానర్‌లో ప్రభాస్ చేస్తున్న ఈ ప్రయత్నం ఫ్యాన్స్‌కి బాగా నచ్చింది, మారుతి కెరీర్‌లో కూడా ఈ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ కానుంది.
Follow Us