Prabhas Lineup: భారీ లైనప్ తో రెబల్ స్టార్.. డార్లింగ్ నయా ప్లాన్ ఇదే!

ప్రభాస్ సినిమాలు సీక్వెల్స్‌కి ఫుల్ లైనప్ లో ఉన్నాయి. రాజా సాబ్ 2, కల్కి 2, సలార్ 2, స్పిరిట్, ఫౌజీ భారీ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వనున్నాయి. ప్రభాస్ మాస్ ఇమేజ్, గ్రాండ్ ప్రొడక్షన్ అన్ని కలిపి రాబోయే కొన్ని సంవత్సరాల్లో బాక్సాఫీస్‌ను హల్‌చల్ చేయనుంది.

New Update
Prabhas Lineup

Prabhas Lineup

Prabhas Lineup: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ది రాజా సాబ్’ సినిమా థియేటర్లలో హల్‌చల్ సృష్టించింది. సినిమా కొంచెం మిక్స్డ్ టాక్ పొందినా, ప్రభాస్ క్రేజ్ తగ్గలేదు. ఆయన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదిరిపోయే కలెక్షన్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.

ఇప్పుడు అభిమానుల దృష్టి అంతా ‘సలార్: పార్ట్ 2 - శౌర్యాంగ పర్వం’పై పడింది. మొదటి భాగం ‘సలార్: సీజ్‌ఫైర్’ ఘన విజయం సాధించి, పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టింది. దేవ పాత్రలో ప్రభాస్ చూపించిన యాక్షన్, ఇంటెన్సిటీ ప్రేక్షకులను కట్టిపడేసింది. రెండో భాగంలో దేవ, వరదరాజ్ మన్నార్ మధ్య స్నేహం శత్రుత్వంగా మారడం, ఖాన్సార్ సింహాసన కోసం రక్తపాత పోరాటం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.

సినిమా ట్విస్ట్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానుల్లో అంచనాలను మరింత పెంచాయి. ప్రశాంత్ నీల్ సీక్వెల్‌ను గ్రాండ్ స్కేల్‌లో రూపొందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. షూటింగ్ 2026 మధ్యలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లో ఎక్కువగా సీక్వెల్స్ రాబోతున్నాయి:

రాజా సాబ్ 2(Raja Saab 2) - మొదటి భాగం చివర్లో క్లియర్‌గా సీక్వెల్ ఉంటుందని చూపించారు. ఈ భాగంలో ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ లుక్‌లో కీలక సీన్లు ఉంటాయి. షూటింగ్ డేట్లు తేడా ఉన్నప్పటికీ, ఏడాది చివరలో క్లారిటీ వస్తుందని టాక్.

కల్కి 2898 AD(Kalki 2898 AD Part 2) - పార్ట్ 2 నాగ్ అశ్విన్ దర్శకత్వంలో. ఫస్ట్ పార్ట్‌లోని సన్నివేశాలను సెకండ్ పార్ట్ కోసం కూడా షూట్ చేశారు. ప్రభాస్ ‘భైరవ’, కమల్ హాసన్ ‘యాస్కిన్’ పాత్రల్లో అసలైన పోరు ఉంటుంది. ఈ సినిమా 2027 మధ్య లేదా చివర్లో విడుదల కావచ్చు.

సలార్ 2 - శౌర్యాంగ పర్వం..(Salaar 2) ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు. దేవ - వరదరాజ్ మన్నార్ మధ్య స్నేహం, శత్రుత్వం ఎలా మారిందో, ఖాన్సార్ సింహాసన కోసం జరిగే యాక్షన్ ప్రధానంగా ఉంటుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది, సెట్స్ పై ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్స్ తరువాత చేరతారు. 2027లో రిలీజ్ కావచ్చని అంచనాలు.

స్పిరిట్ (Spirit)- సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. రెండు భాగాలుగా రావచ్చని సోషల్ మీడియాలో చర్చ, కానీ అధికారిక ప్రకటన రాలేదు.

ఫౌజీ (Fauzi)- హను రాఘవపూడి దర్శకత్వంలో పిరియాడికల్ వార్ యాక్షన్. షూటింగ్ దాదాపు ముగింపు దశలో ఉంది.

రాబోయే రెండు-మూడు సంవత్సరాల్లో ప్రభాస్ అన్ని ప్రాజెక్ట్స్ సీక్వెల్స్‌తోనే ప్యాక్ అయ్యి ఉన్నాయి. అభిమానులు, బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సీక్వెల్స్ క్రేజ్ ఏ స్థాయికి చేరుతుందో చూడటానికి ఉత్కంఠలో ఉన్నారు.

ప్రభాస్ సినిమాలు సీక్వెల్స్‌కి ఫుల్ లైనప్ లో ఉన్నాయి. రాజా సాబ్ 2, కల్కి 2, సలార్ 2, స్పిరిట్, ఫౌజీ ప్రేక్షకులకు భారీ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వనున్నాయి. ప్రభాస్ మాస్ ఇమేజ్, గ్రాండ్ ప్రొడక్షన్ అన్ని కలిపి రాబోయే కొన్ని సంవత్సరాల్లో బాక్సాఫీస్‌ను హల్‌చల్ చేయనుంది.

Advertisment
తాజా కథనాలు