/rtv/media/media_files/2025/03/17/PYPqlqlWMsBWBXxEfuqq.jpg)
Baahubali 1 Re-Release
Baahubali 1 Re-Release: ఇటీవల రీ రీలీజుల ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరిగిపోయింది. మొన్న రీ రిలీజ్ అయిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" కి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. తాజాగా, "సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్" అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వారం ముందుగానే దాదాపు అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ అయ్యాయి. సలార్ వచ్చి 1 ఇయరే అయినప్పటికీ రీ రిలీజ్ లో ఈ రేంజ్ బుకింగ్స్ అవ్వడం విశేషం.
10వ వసంతాన్ని పురస్కరించుకుని..
ఇదంతా పక్కన పెడితే , ప్రభాస్ ఫాన్స్ కు ఇంకో మూడు నెలల్లో మరో పెద్ద పండగ రాబోతుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ రూపు రేఖలు మార్చేసిన సినిమా "బాహుబలి 1: ది బిగినింగ్" 10వ వసంతాన్ని పురస్కరించుకుని జులై లో రీ రీలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత శోభు యార్లగడ్డ సోషల్ మీడియాలో వెల్లడించారు, అయితే విడుదల తేదీపై ఇంకా క్లారిటీ లేదు.
Also Read:Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!
"బాహుబలి" గురించి చెప్పాలి అంటే టాలీవుడ్లో బాహుబలికి ముందు బాహుబలికి తర్వాతా అంతలా చరిత్ర సృష్టించింది. రాజమౌళి, ప్రభాస్ ద్వారా తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అసలు బాహుబలి అనేదే లేకపోతే ఈ రోజు మనం చూస్తున్న పాన్ ఇండియా సినిమాలు అన్న మాటే లేదు.
Also Read:Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
"బాహుబలి 1" రీ రీలీజ్ చేస్తే, రికార్డులు బద్దలవ్వడం ఖాయం. ఎందుకంటే బాహుబలి 1 రిలీజ్ టైమ్ లో చిన్న పిల్లలకి ఆ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండి ఉండదు. కాబట్టి అలాంటి పిల్లలు ఇప్పుడు పెరిగి పెద్దయ్యి వారికి మళ్ళీ బాహుబలిని థియేటర్లో చూసే అవకాశం రావడంతో రీ రిలీజ్ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఓటిటి, టీవీలలో చాలా సార్లు ఈ సినిమాను చూసినా, బిగ్ స్క్రీన్ మీద మంచి ఆడియో-విజువల్ తో చుస్తే ఆ కిక్కే వేరు. మరి బాహుబలి 1 రీ రిలీజ్ లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
Also Read:DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్