పిఠాపురంలో హైటెన్షన్.. పుష్ప2 ఫ్లెక్సీల చించివేత.!

పిఠాపురంలో 'పుష్ప2' ఫ్లెక్సీల చింపివేత కలకలం రేపింది. ఫ్లెక్సీల చించివేతపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే మెగా ఫ్యాన్స్ 'పుష్ప2' ఫ్లెక్సీలు, పోస్టర్లు చించివేశారని బన్నీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

New Update

Pushpa 2:  అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప2 మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్  అభిమానులు సినిమా  కటౌట్లు, ఫ్లెక్సీలతో సందడి చేస్తున్నారు. బాణాసంచాతో థియేటర్ల వద్ద సంబరాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో పిఠాపురంలో  థియేటర్ల ముందు  'పుష్ప2'  ఫ్లెక్సీలను చింపివేయడం కలకలం రేపుతోంది. ఫ్లెక్షీల చింపివేత పై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో  మెగా వెర్సెస్ అల్లు ఫ్యాన్స్  వివాదం కొనసాగుతూనే ఉంది. ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ తన మేనమామ పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి శిల్పారవికి సపోర్టుగా నంద్యాలలో ప్రచారం చేయడం మెగా ఫ్యామిలీలో చిచ్చు రేపింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రిలీజ్ కి ముందు ఇలా ఫ్లెక్సీలు చింపడంతో ఉద్దేశపూర్వకంగానే మెగా ఫ్యాన్స్ ఫ్లెక్సీలు చించివేశారని బన్నీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. 

మరోవైపు పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా..  

ఇది ఇలా ఉంటే పిఠాపురంలో అదే థియేటర్ల ముందు పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కు సపోర్ట్ గా పుష్ప2 ఫ్లెక్షీలు వేయించడం కూడా కనిపిస్తోంది. సినిమా విషయానికి వస్తే మెగాస్టార్, పవన్, రాంచరణ్, అల్లు అర్జున్ అందరు మాకు ఒకటే.. ఎలాంటి విభేదాలు లేవు.. అందరికీ సపోర్ట్ చేస్తాము అంటూ చెబుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఇదంతా ఎవరో గుర్తుతెలియని  కొంతమంది చేస్తున్న పని అని కూడా అంటున్నారు. 

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

Advertisment
Advertisment
తాజా కథనాలు