OG Trailer
OG Trailer: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన 'OG' చిత్రం ట్రైలర్ చివరికి యూట్యూబ్ లో విడుదలైంది. అయితే, మొదట చిత్ర బృందం దీనిని ఆన్‌లైన్‌లో కాకుండా, హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో(OG Pre Release Event) అభిమానుల సమక్షంలో ప్రదర్శించింది. ఈ నిర్ణయం ఆన్‌లైన్‌లో ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులను కాస్త నిరాశపరిచింది. అయితే ఈరోజు మధ్యాహ్నం ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మూవీ టీమ్.
పవర్ ఫుల్ డైలాగ్‌లు..
ఇప్పటికే సోషల్ మీడియాలో 'OG' ట్రైలర్ తాలూకు లీకైన క్లిప్‌లు, ఫోన్ రికార్డింగ్‌లు వైరల్ అవుతున్నాయి. దీంతో ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో అదరగొట్టారు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్‌ను కొత్త కోణంలో చూపించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించడం, ప్రియాంక మోహన్ కథానాయికగా కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Follow Us