Pawan Kalyan OG
Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో 'ఓజీ' ఒకటి. సాహూ ఫేమ్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి.
Also Read:అండర్ వేర్లు, చెప్పులపై హిందూ దేవుళ్ళ బొమ్మలు.. వాల్ మార్ట్ దుమారం!
థాయ్‌లాండ్‌లో లో ఓజీ షూటింగ్..
ఇది ఇలా ఉంటే.. తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం 'ఓజీ' షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారీ నౌక, ఎయిర్ పోర్ట్, స్టైలిష్ కారు స్టిల్స్ చూస్తుంటే సినిమా భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లొకేషన్ విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. 2023 లో మొదలైన ఓజీ చిత్రీకరణ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆలస్యం అవుతూ వస్తుంది.
OG #TheyCallHimOG Thailand shooting 🔥🏌🏻♂️ pic.twitter.com/nTP79nhOCf
— SENANI Followers (@SenaniFollowers) December 8, 2024
'ఓజీ' మూవీలో పవన్ కళ్యాణ్ జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించగా.. ఇమ్రాన్ హష్మీ, , ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి తదితరులు కీలక పాత్రలో పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
Also Read:ఇదెక్కడి వింతరా బాబు.. బంగారు నగలతో పిల్లికి శ్రీమంతం.. మామూలుగా లేదుగా!