OG Special Song: 'OG' మూవీలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ ఎందుకు కట్ చేశారంటే..?

పవన్ కళ్యాణ్ 'OG'లో నేహా శెట్టి చేసిన స్పెషల్ సాంగ్ తీసేసారు. అయితే గతంలో స్పెషల్ సాంగ్ విషయాన్ని నేహా స్వయంగా తెలిపారు. అయితే ఈ సాంగ్ ను OG 2 కోసం లేదా OTTలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసి ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

New Update
OG Special Song

OG Special Song

OG Special Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) తాజా చిత్రం "OG - They Call Him OG" గ్రాండ్ గా ప్రీమియర్ షోలతో విడుదలై, మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. దర్శకుడు సుజీత్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను స్టైలిష్‌గా తెరకెక్కించారు.

అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. DJ టిల్లు ఫేమ్ నేహా శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ కోసం షూట్ చేసిన సంగతి అప్పట్లో ఫుల్ వైరలైంది. ఆమె స్వయంగా ఒక ఈవెంట్‌లో ఈ విషయాన్ని క్లియర్‌గానే చెప్పింది కూడా.

పాట షూట్ అయింది... కానీ మిస్సింగ్..

నేహా శెట్టి పాట OGలో ఉంటుందని ఫ్యాన్స్ ఎదురు చూసారు. కానీ సినిమా విడుదలైన తర్వాత, ఆ పాట ఎక్కడా కనిపించకపోవడంతో అందరూ  ఆశ్చర్యపోయారు. చివరకు మేకర్స్ ఆ పాటను ఫైనల్ కట్ నుంచి తొలగించారని తెలిసింది.

అయితే ఈ పాటను ఎందుకు కట్ చేసారనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు ఇదే విషయంపై ఫ్యాన్స్ డిస్కషన్స్ లో బిజీ అయ్యారు.

OTTలో ఉంటుందా..?

ఇప్పటికే ఫ్యాన్స్ మధ్య ఓ రూమర్ వైరల్ అవుతోంది. OG 2 కోసం లేదా డైరెక్ట్ OTT వేదికపై విడుదల చేయడానికే ఆ పాటను కట్ చేసి ఉంచారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

మూవీ డీటెయిల్స్

'OG'లో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ ఎస్ ఎస్ పని చేశారు. నేహా శెట్టి పాడిన స్పెషల్ సాంగ్ OG చిత్రంలో నుంచి ఎందుకు తీసేశారన్నదానిపై స్పష్టత లేదు. OG 2 కోసం లేదా ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే తొలగించారన్న టాక్ వినిపిస్తోంది. మేకర్స్ నుంచి అధికారిక సమాచారం కోసం ఫ్యాన్స్  చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు