Pawan Kalyan Fans: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- డైరెక్టర్ సుజిత్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'ఓజీ'. దాదాపు మూడేళ్ళుగా పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు రేపు థియేటర్స్ లో విడుదల అవుతోంది. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ లో హైప్ పీక్స్ కి చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన 'ఓజీ' మేనియా కనిపిస్తోంది. ఇప్పటికే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. చాలా చోట్ల థియేటర్లు హౌజ్ బోర్డులు తిప్పేశారు. మరోవైపు ప్రీమియర్ షో టికెట్లు కూడా రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ప్రీమియర్ షో టికెట్ల కోసం థియేటర్లు ముందు క్యూ కడుతున్నారు ఫ్యాన్స్. టికెట్ కోసం వేలల్లో, లక్షల్లో కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడడం లేదు.
థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ రచ్చ
ఈ క్రమంలో భద్రాచలం ఏషియన్ థియేటర్ దగ్గర టికెట్ల విషయంలో రచ్చ రచ్చ చేశారు పవన్ ఫ్యాన్స్. ప్రీమియర్ షో టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారంటూ థియేటర్ యాజమాన్యం పై దాడికి దిగారు. టికెట్లు ఇవ్వకపోతే ప్రీమియర్ షోను అడ్డుకుంటామంటూ ఆందోళన చేస్తున్నారు. ప్రీమియర్ షో టికెట్లను అభిమానులకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో థియేటర్ ముందు ఉద్రిక్తత వాతావరం నెలకొంది. విషయం తెలుసుకున్న అక్కడి చేరుకొని ఫ్యాన్స్ ను అదుపు చేసే ప్రయత్నం చేశారు. థియేటర్ యాజమాన్యం, అలాగే ఫ్యాన్స్ తో చర్చలు జరిపి సర్ది చేశారు.
ఇదిలా ఉంటే.. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన 'ఓజీ ' చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర అనే గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే మూవీ ట్రైలర్ విడుదలవగా.. ట్రైలర్ లో ''ముంబై వస్తున్న.. తలలు జాగ్రత్త'' అంటూ పవన్ డైలాగ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. పవన్ స్టైల్, స్వాగ్, యాక్షన్, డైలాగ్ డెలివరీ విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. బ్రో, హరిహర వీరమల్లు డిజాస్టర్స్ తర్వాత పవన్ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్లే ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ చేసింది.
రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్
భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఏమండీ ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది. పలు నివేదికల ప్రకారం.. ఓవర్ సీస్ లో ప్రీ సేల్స్ ద్వారా $3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇండియాలో రూ. 45 కోట్లు వసూలు చేసినట్లు టాక్. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 75 కోట్లు వసూలు చేసింది. దీని ప్రకారం ఓపెనింగ్ రోజే రూ. 100 కోట్లు సాధించ వచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కాబోతోంది.
Also Read: జంబర్ గింబర్ లాలా.. బ్రహ్మీ కొత్త సాంగ్ అదిరింది! చూస్తే నవ్వులే నవ్వులు