జంబర్ గింబర్ లాలా
''జాంబర్ గింబర్ లాలా'' అంటూ ఫన్నీ లిరిక్స్ తో మొదలైన ఈ పాట నవ్వులు పూయించింది. ఇందులో బ్రహ్మానందం ఎక్స్ ప్రెషన్స్, డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను అలరించాయి. అలాగే పాట మధ్యలో బెండకాయ దొండకాయ నువ్వే నా గుండెకాయ, ఆక్ ఈజ్ పాక్ పాక్ ఈజ్ ఆక్ ఆక్ పాక్ కరేపాక్... నాతోటి వస్తావా తినిపిస్తా మైసూర్ పాక్...' అనే లిరిక్స్ నవ్వులు పూయించాయి. పాటలోని విజువల్స్ ప్రియదర్శి, నిహారిక స్టెప్పులు కూడా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఒక డైలాగ్ కాన్సెప్ట్ తో కొత్తగా అనిపించింది పాట. ఆర్. ఆర్. ధృవన్ సంగీతం అందించిన ఈ పాటను దితి భావరాజు, ఆర్ఆర్ ధృవన్ ఆలపించారు.
కామెడీ ఎంటర్ టైనర్
కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి విజయేందర్ ఎస్. దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, నిహారిక, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నిర్మాత బన్నీ వాసు సమర్పణలో కొత్త ప్రొడక్షన్ బ్యానర్ 'బి.వి. వర్క్స్' పై కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డాక్టర్ విజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఫ్రెండ్స్గ్యాంగ్చుట్టూతిరిగేకథ
ఈ సినిమా కథ ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో స్నేహం, కామెడీ, ఎమోషన్స్ అన్నీ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలోని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని టీజర్ వీడియో ద్వారా అర్థమైంది. మొత్తంగా ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ చుట్టూ తిరిగే కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. బలాదూర్ గా తిరిగే ఫ్రెండ్స్ గ్యాంగ్ అనుకోకుండా ఒక రాజకీయ నాయకుడి వివాదంలో చిక్కుకుంటారు. ఈ ఈ క్రమంలో జరిగే పరిణామాలె సినిమాకు హాస్యాన్ని జోడిస్తాయి.
ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. పోస్టర్లలో నటులంతా ముసుగులు ధరించి ఉండటం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. అక్టోబర్ 16న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. నిర్మాత బన్నీ వాసు ఇటీవలే ఓ ఈవెంట్ లో సినిమా గురించి మాట్లాడుతూ.. 'మిత్ర మండలి ' ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్విస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఇదిలా వుంటే ప్రియదర్శి రీసెంట్ గా కోర్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇందులో ప్రియదర్శి లాయర్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు