OG Movie: పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఫీవర్ పీక్స్ లో ఉంది. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రికార్డ్ స్థాయిలో ప్రీసేల్ బిజినెస్ జరుగుతోంది. ఇండియాతో పాటు ఓవర్ సీస్ లోనూ సంచలనం సృష్టిస్తోంది. అమెరికాలో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ లు జరుగుతున్నాయి. అమెరికా ప్రీమియర్ షోల ద్వారా ఇప్పటికే $1,833,771 (సుమారు 15 కోట్ల రూపాయలు) వసూలు చేసింది ఓజీ. మొత్తం 482 లొకేషన్లలో 2083 షోలకు గానూ 63, 908 టికెట్లు అమ్ముడయ్యాయి. అమెరికాతో పాటు కెనెడాలో కూడా 'ఓజీ' అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ రెండు దేశాల్లో కలిపి $2.003 మిలియన్ల (సుమారు 16.7 కోట్ల రూపాయలు) ప్రీ బిజినెస్ పలు నివేదికలు చెబుతున్నాయి. విడుదలకు ముందే $2 మిలియన్ వసూలు చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఓవర్ సీస్ లో ఈ అరుదైన ఫీట్ సాధించిన అతి కొన్ని చిత్రాల్లో 'ఓజీ' ఒకటిగా నిలిచింది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే.. సినిమా పట్ల అభిమానుల్లో అంతటి క్రేజ్ ఉందో తెలుస్తోంది.
#OG - FIRST EVER INDIAN FILM TO HAVE CROSSED TWO MILLION PRE SALES IN NORTH AMERICA WITHOUT A TRAILER RELEASE pic.twitter.com/gt9mG9CpHA
— Aakashavaani (@TheAakashavaani) September 20, 2025
భారీ ఓపెనింగ్స్
ప్రీ సేల్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే.. ఈ సినిమా రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ సాదిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 'OG' ప్రీమియర్లు సెప్టెంబర్ 24న తెలంగాణ, ఆంద్రప్రదేశ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు ఉన్నాయి. దీంతో పవన్ అభిమానులకు విడుదలకు ఒకరోజు ముందుగానే 'ఓజీ' ఫీస్ట్ ఎంజాయ్ చేసే అవకాశం కలిగింది. ఇదిలా ఉంటే పుష్ప2 తొక్కిసలాట తర్వాత విడుదలైన ఏ సినిమాకు ప్రీమియర్ షోల అవకాశం కల్పించలేదు తెలంగాణ ప్రభుత్వం. ఆ సంఘటన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదటి సారి ప్రీమియర్స్ కి అనుమతిచ్చింది.
గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించగా.. DVV ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై DVV దానయ్య నిర్మించారు. ఇందులో పవన్ కళ్యాణ్ 'ఓజస్' గంభీర అనే ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ దాస్, శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హరిహరవీరమల్లు డిజాస్టర్ తర్వాత పవన్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.