వరుసగా ఆరు సార్లు అనారోగ్యం.. పవన్ స్టార్ కు అసలేమైంది?

పవన్ కళ్యాణ్ కొంతకాలంగా పలుమార్లు అనారోగ్యం బారిన పడ్డారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నెలల వ్యవధిలోనే అస్వస్థతకు గురయ్యారు. 2022లో ఆయనకు వెన్ను నొప్పి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరు సార్లు ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

pwan
New Update

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు జ్వరంతోపాటూ.. జలుబు, దగ్గు కూడా ఉన్నాయి. అందుకే నిన్న జరిగిన ఏపీ కేబినేట్ సమావేశానికి రాలేకపోయారు. ఈ విషయం తెలిసి అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన అనారోగ్యం బారిన పడటం ఇదేం మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు ఇలా జరిగింది. ముఖ్యంగా పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నెలల వ్యవధిలోనే అస్వస్థతకు గురయ్యారు. 

ఆరు సార్లు..

2022 జులైలో పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రలో పాల్గొన్నారు. ఆ సమయంలో వానలో తడుస్తూ సభలో పాల్గొనడం మాత్రమే కాక ఒక అభిమాని మీద పడిపోవడంతో పవన్ కు వెన్నునొప్పి ప్రారంభమైంది. దాంతో కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్నారు. 2023 జూన్ లో వారాహి అమ్మవారి నవరాత్రులు సందర్భంగా ఉపవాస దీక్ష చేశారు. దీక్ష వల్ల బాగా నీరసం రావడంతో అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత 2024 ఏప్రిల్ లో వారాహి యాత్ర జరుగుతున్న సమయంలో కొన్ని రోజుల ప్రచారం తర్వాత ఆరోగ్యం సహకరించక తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. 

Also Read : పాపం పూజా హెగ్డే.. చివరికి అంతకు దిగజారిందా?

అయినా కూడా  చంద్రబాబునాయుడుతో కలిసి ఉమ్మడి ప్రచారంలో పాల్గొన్నారు. ఐతే, అప్పటికే పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ముతో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నెల వరదల సమయంలో తీవ్ర జ్వరం, దగ్గుతో ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు.   తీవ్ర అస్వస్థతతో ఉన్నప్పటికీ తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షలు జరిపారు.

ఇక ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ జరగడంపై ఆయన ప్రాయస్థిత దీక్ష చేశారు. ఆ దీక్షను విరమించడం కోసం తిరుమలకు కాలి నడకన వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు ఆరోగ్యం ఏమాత్రం సహకరించలేదు. ఇక మళ్ళీ రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కేవలం నెలల వ్యవధిలోనే పవన్ ఇలా పలుమార్లు అనారోగ్యం బారిన పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మొదట ఆయన తన ఆరోగ్యంపై దృష్టి సారించాలని, పూర్తిగా కోలుకున్నాకే రాజకీయ సమావేశాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నారు.

#pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe