HBD OG GLIMPSE: 'ఓజీ' స్పెషల్ గ్లింప్స్‌ వీడియో వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్!

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఓజీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేశారు. ఇందులో పవన్ లుక్, డైలాగ్స్ ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్స్ లో విడుదల కానుంది. 

New Update

HBD OG GLIMPSE: పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఓజీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేశారు. ఇందులో పవన్ లుక్, డైలాగ్స్ ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి. విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ డైలాగ్స్, విజువల్స్ హైలైట్ గా అనిపించాయి. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్ గా నిలిచింది. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమాతో నిరాశపరిచినప్పటికీ..   'ఓజీ' తో  బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించడానికి సిద్దమైనట్లు గ్లింప్స్‌ తో అర్థమవుతోంది. 

 బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ఈ సినిమాలో  తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో అటు హిందీ, ఇటు తెలుగులో 'ఓజీ' కి మంచి మార్కెట్ ఏర్పడింది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కల్యాణ్‌ దాసరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి  'సాహో' ఫేమ్ సుజిత్  దర్శకత్వం వహించారు.  భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన 'ఓజీ' ఈనెల 25న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే పోస్టర్, గ్లిమ్ప్స్, సాంగ్స్  వంటి ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన  'సువ్వి.. సువ్వి', 'ఫైర్ స్ట్రోమ్' లిరికల్ సాంగ్స్ సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి.  

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో విడుదలైన 'సువ్వి.. సువ్వి', రొమాంటిక్ మెలోడీలో  ప్రియాంక - పవన్ మధ్య కెమిస్ట్రీ, సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రియాంక  'కన్మణి' పాత్రలో నటించింది. ఒక గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ సైడ్ కూడా ఉండబోతుందని ఈ సాంగ్ తో అర్థమైంది. 

స్పెషల్ సాంగ్

అయితే 'ఓజీ' లో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ నెంబర్ కోసం డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నేహా గ్లామర్, యూత్ లో ఆమెకున్న ఫాలోయింగ్  సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. 'టిల్లు' మూవీలో రాధిక పాత్రతో యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది నేహా. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ  అనుకున్నంత సక్సెస్ రాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు.  'ఓజీ' స్పెషల్ సాంగ్ తో నేహా మళ్ళీ ఫార్మ్ లోకి రావాలని కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. 

Also Read: HBD Pawan Kalyan: ''మనల్ని ఎవడ్రా ఆపేది''.. గీతా ఆర్ట్స్ నుంచి గూస్ బంప్స్ తెప్పిస్తున్న పవర్ స్టార్ మ్యాషప్ వీడియో!

Advertisment
తాజా కథనాలు